ETV Bharat / business

రిలయన్స్​ సీఎస్​ఆర్​ నిధులు రూ.1,140కోట్లు - సీఎస్​ఆర్

రిలయన్స్​ సంస్థ కార్పొరేట్​ సామాజిక బాధ్యత (సీఎస్​ఆర్​) కింద గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,140 కోట్లను వెచ్చించింది. కరోనాపై పోరాటంలో, గ్రామీణాభివృద్ధి, విద్యా, ఆరోగ్యం, విపత్తు నిర్వహణలో ఖర్చు చేసినట్లు తాజా వార్షిక నివేదికలో పేర్కొంది.

Reliance spends Rs 1,140 cr under CSR
రిలయన్స్​ సీఎస్​ఆర్
author img

By

Published : Jun 4, 2021, 5:36 AM IST

Updated : Jun 4, 2021, 8:11 AM IST

కార్పొరేట్​ సామాజిక బాధ్యత (సీఎస్​ఆర్​) కింద రిలయన్స్​ సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,140 కోట్లను వెచ్చించింది. కరోనాపై పోరాటంలో, గ్రామీణాభివృద్ధి, విద్యా, ఆరోగ్యం, విపత్తు నిర్వహణలో ఖర్చు చేసినట్లు తాజా వార్షిక నివేదికలో పేర్కొంది.

కోరనాపై పోరులో హెల్త్​కేర్​, మెడికల్​ ఆక్సిజన్​, భోజనం, మాస్క్​లు పంపిణీ చేసింది రిలయన్స్​ సంస్థ. 1,000 టన్నుల ఆక్సిజన్​ను ఉత్పత్తి చేసే ప్లాంట్​ను గుజరాత్​లోని జామనగర్​​లో నిర్మించింది. 27 లక్షల మందికి భోజనాన్ని పంపణీ చేసింది. 81 లక్షల​ మాస్క్​లను ఫ్రంట్ లైన్​ వర్కర్లకు పంపిణీ చేసింది. కరోనా సేవలకు వినియోగించే ఆంబులెన్స్​లకు 5.5 లక్షల లీటర్ల ఇంధనాన్ని వెచ్చించింది. గ్రామీణాభివృద్ధి, ఆటలు, రిలయన్స్​ ఫౌండేషన్​ తరపున స్కాలర్​షిప్స్​ తదితర అంశాల్లో ఖర్చుచేసింది.

ఇవీ చదవండి:కరోనా రోగుల కోసం 'రిలయన్స్' మందు!

మాల్యా ఆస్తుల వేలానికి కోర్టు గ్రీన్​సిగ్నల్

Last Updated : Jun 4, 2021, 8:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.