ETV Bharat / business

'రిలయన్స్' మరో ఘనత.. ఫోర్బ్స్​ జాబితాలో భారత్​ నుంచి ఫస్ట్​ - రిలయన్స్ ఇండస్ట్రీస్​ వార్తలు

ఫోర్బ్స్​ ఈ ఏడాది ప్రకటించిన వరల్డ్​ బెస్ట్​ ఎంప్లాయర్స్​ ర్యాంకింగ్స్​లో భారత్​ తరపున రిలయన్స్​ అగ్రస్థానంలో నిలిచింది. వంద ర్యాంకు లోపల భారత్‌ నుంచి మరో మూడు కంపెనీలు.. ఐసీఐసీఐ బ్యాంకు(65), హెచ్‌డీఎఫ్‌సీ(77), హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌(90) నిలిచాయి.

reliance industries
రిలయన్స్​ వార్తలు
author img

By

Published : Oct 15, 2021, 4:26 AM IST

భారత్‌కు చెందిన ప్రముఖ సంస్థ 'రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్' మరో ఘనత సాధించింది. ఫోర్బ్స్ తాజాగా ప్రకటించిన 'ప్రపంచ అత్యుత్తమ యాజమాన్యాలు (వరల్డ్స్‌ బెస్ట్‌ ఎంప్లాయర్స్‌) ర్యాంకింగ్స్- 2021లో భారతీయ కార్పొరేట్‌ సంస్థల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మొత్తం 750 సంస్థలు ఉండగా, రిలయన్స్ 52వ ర్యాంకు సంపాదించింది. వంద ర్యాంకు లోపల భారత్‌ నుంచి మరో మూడు కంపెనీలు.. ఐసీఐసీఐ బ్యాంకు(65), హెచ్‌డీఎఫ్‌సీ(77), హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌(90) నిలిచాయి. దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, యాపిల్‌, అల్ఫాబెట్‌, డెల్‌ తరువాతి స్థానాలు దక్కించుకున్నాయి. చైనాకు చెందిన హువాయి ఎనిమిదో స్థానంలో నిలిచింది.

లక్షన్నర ఉద్యోగులను సర్వే చేసి..

ఆయా బహుళజాతి కంపెనీల్లో పనిచేస్తున్న 58 దేశాలకు చెందిన 1.50 లక్షల మంది ఫుల్‌టైం, పార్ట్‌టైమ్ ఉద్యోగులను సర్వే చేసి ర్యాంకింగ్‌ వెల్లడించినట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఈ క్రమంలో మార్కెట్ రీసెర్చ్‌ సంస్థ 'స్టాటిస్టా'తో భాగస్వామ్యమైనట్లు వెల్లడించింది. తాము పనిచేస్తున్న కంపెనీని స్నేహితులు, కుటుంబ సభ్యులకు సిఫారసు చేయడానికి సుముఖత, సంస్థ ఇమేజ్, ఆర్థిక నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి, లింగ సమానత్వం, సామాజిక బాధ్యత తదితర అంశాల్లో ఉద్యోగుల నుంచి రేటింగ్‌ సేకరించినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఫోర్బ్స్‌ విడుదల చేసిన భారత కుబేరుల జాబితా-2021లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ వరుసగా 14వ ఏడాదీ తొలి స్థానాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే.

ఇతర భారతీయ సంస్థల ర్యాంకింగ్‌..

ఎస్బీఐ 119, ఎల్‌ అండ్‌ టీ 127, బజాజ్ 215, యాక్సిస్ బ్యాంక్ 254, ఇండియన్ బ్యాంక్ 314, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ) 404, అమరరాజా గ్రూప్ 405, కోటక్ మహీంద్రా బ్యాంక్ 418, బ్యాంక్ ఆఫ్ ఇండియా 451, ఐటీసీ 453, సిప్లా 460, బ్యాంక్ ఆఫ్ బరోడా 496, ఎల్‌ఐసీ 504, ఇన్ఫోసిస్‌ 588, టాటా గ్రూప్‌ 746.

ఇదీ చూడండి : జీ ఎంటర్​టైన్​మెంట్​తో రిలయన్స్​ విలీన ప్రతిపాదన రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.