ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్).. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌తో కలిసి మొట్టమొదటి కృత్రిమ మేధ చాట్‌బాట్‌ను ఆవిష్కరించింది. రూ.53,125 కోట్ల మెగా రైట్స్ ఇష్యూపై వాటాదార్లకు చాట్‌బాట్ సమాధానాలు ఇస్తుంది. జియో హాప్టిక్ టెక్నాలజీస్ ఈ చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత స్టాక్ మార్కెట్లలో మదుపర్లకు తోడ్పాటు అందించడానికి కంపెనీ కృత్రిమ మేధను వినియోగించడం ఇదే ప్రథమం. చాట్‌బాట్ ఇచ్చే సమాధానాలు ఆంగ్లంలో ఉంటాయి. ప్రశ్నలతో రూపొందించిన వీడియోలు మాత్రం ఆంగ్లం, హిందీ, మరాఠి, కన్నడ, గుజరాతీ, బంగ్లా భాషల్లో చూడొచ్చు.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 26 లక్షల మందికి పైగా వాటాదార్లు ఉండగా.. వాట్సాప్‌కు భారత్‌లో 40 కోట్లకు పైగా వినియోగదార్లు ఉన్నారు. చాట్‌బాట్ సేవలను వాట్సాప్ సాయంతో పొందొచ్చు. +9179771 11111 నెంబరుకు హాయ్ అని మెసేజ్ పంపితే.. చాట్‌బాట్ సేవలు యాక్టివేట్ అవుతాయి. వెంటనే వీడియోలు, రైట్స్ ఇష్యూకు సంబంధించిన ప్రధాన తేదీలు, షేర్‌హోల్డర్ ఎంటైటిల్‌మెంట్, భౌతిక షేర్ల ట్రేడింగ్, నమూనా ఫారాలు వంటి లింక్‌లు కనిపిస్తాయి. మే 20న ప్రారంభమైన ఆర్‌ఐఎల్ మెగా రైట్స్ ఇష్యూ.. జూన్ 3తో ముగియనుంది.