ప్రపంచవ్యాప్తంగా గతవారం విడుదలైన రెడ్‌మీ నోట్ 10ఎస్తో పాటు లాంఛ్ అయిన రెడ్‌మీ వాచ్ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఎంఐ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు.. ఫ్లిప్‌కార్ట్ స్టోర్లలో లభించనున్న ఈ వాచ్ ధర రూ.3,999. భిన్నమైన పట్టీతో పాటు వివిధ వాచ్ కేస్లలో లభించే దీనిలో.. రన్నింగ్, హైకింగ్, వాకింగ్, ఇండోర్ సైక్లింగ్, ఈత, సహా 11 స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి.
రెడ్‌మీ వాచ్ ఫీచర్లు..
- 1.4 అంగుళాల ఎల్‌సీడీ డిస్ప్లే
- బరువు: 32గ్రాములు
- 320x320 పిక్సెల్స్ రిజల్యూషన్
- వాటర్ రెసిస్టెంట్ ఫీచర్
- 2.5 డి కర్వ్డ్ గ్లాస్
- 350 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
- 10 రోజుల బ్యాటరీ లైఫ్(ఒకసారి ఛార్జీ చేస్తే)
- జీపీఎస్ ట్రాకింగ్
- బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ
ఇవేగాక దీనిలో హృదయ స్పందన సెన్సార్, యాక్సిలరేషన్ సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్, బేరోమీటర్, గైరోస్కోప్ సెన్సార్లు ఉన్నాయి.
ఇవీ చదవండి: బడ్జెట్ ధరలో రెడ్‌మీ నుంచి సరికొత్త ఫోన్లు