ETV Bharat / business

ప్రివ్యూ 2021: ఆశల పల్లకిలో స్థిరాస్తి రంగం - 2021పై రియల్టీ రంగం ఆశలు

నోట్ల రద్దు మొదలుకుని జీఎస్​టీ, రెరా అమలుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రియల్టీ రంగం.. ఈ ఏడాది కరోనా వల్ల తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది. వచ్చే ఏడాదైనా ఈ రంగం కోలుకుంటుందని రియల్టీ డెవలపర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి రియల్టీ రంగం కోలుకునేందుకు ఉన్న అవకాశాలేమిటి? వచ్చే ఏడాది డిమాండ్ రికవరీ కోసం డెవలపర్లు కోరుతున్నదేమిటి?

builders look to 2021 with hopes of demand revival
2021పై రియల్టీ రంగం అంచనాలు
author img

By

Published : Dec 28, 2020, 1:54 PM IST

కరోనా వల్ల తీవ్రంగా కుదేలైన రంగాల్లో 'రియల్ ఎస్టేట్​' ఒకటి. 2016లో నోట్ల రద్దు సహా ఇతర కారణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ రంగానికి.. 2020లో కరోనా మహమ్మారి వల్ల మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దీనితో ఇళ్ల విక్రయాలు, కార్యాలయ స్థలాల లీజింగ్​లు 40-50 శాతం పడిపోయినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ సంక్షోభం నుంచి తేరుకుని.. 2021లో విక్రయాలు పెరిగి రియల్టీ రంగం కోలుకుంటుందని ఆశిస్తున్నారు విశ్లేషకులు.

స్థిరమైన ఆస్తి ధరలు, గృహ రుణాలపై భారీగా తగ్గిన వడ్డీ రేట్లు, డెవలపర్లు అందిస్తున్న డిస్కౌంట్లు, ఇతర పథకాలు, కొన్ని రాష్ట్రాలు స్టాంప్​ డ్యూటీ రేట్లను తగ్గించడం వంటి కారణాలతో.. విక్రయాలు పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

విక్రయాలు తగ్గేందుకు కారణాలు..

కరోనా విజృంభణతో రెండు నెలల పాటు విధించిన కఠిన లాక్​డౌన్ వల్ల గృహ విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. డిజిటల్ మాధ్యమాల ద్వారా విక్రయాలు పెంచుకునేందుకు రియల్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా సెప్టెంబర్​ వరకు గృహ విక్రయాల్లో క్షీణత నమోదవుతూనే వచ్చింది.

పండుగ సీజన్​తో అక్టోబర్​లో ఇళ్ల విక్రయాలు స్వల్పంగా పుంజుకున్నాయి. అయినప్పటికీ చాలా పట్టణాల్లో అమ్మకాలు కరోనా ముందు స్థాయికి చేరాల్సిన అవసరముందని రియల్టీ డెవలపర్లు చెబుతున్నారు.

గత ఏడాదితో పోలిస్తే ఇప్పటి వరకు ఇళ్ల విక్రయాలు దేశీయంగా ఏడు ప్రధాన నగరాల్లో 47 శాతం క్షీణించినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ నివేదిక పేర్కొంది. మొత్తం ఇళ్ల విక్రయాలు 1.38 లక్షలకు పరిమితమైనట్లు వివరించింది.

అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే..

మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీలను తగ్గించడం బిల్డర్లకు, కొనుగోలుదారులిద్దరికీ ఊరట లభించింది. ముంబయి, పుణె లాంటి నగరాల్లో డిమాండ్ పుంజుకునకేందుకు ఇది కారణమైందని డెవలపర్లు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేస్తే రియల్టీ రంగం వేగంగా రికవరీ సాధిస్తుందని అంటున్నారు.

డిమాండ్లు..

'రియల్టీ రంగం.. పెద్ద నోట్ల రద్దు, జీఎస్​టీ, రెరా వంటి సంస్కరణల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కొవిడ్ సంక్షోభంతో పరిస్థితులు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారాయి.' అని క్రెడాయ్​ ఛైర్మన్​ జాక్సీ షా అన్నారు.

వరుస అనిశ్చితుల వల్ల రియల్టీ రంగం తీవ్రంగా కుదేలైందని క్రెడాయ్​ అధ్యక్షుడు సతీశ్ మగర్ పేర్కొన్నారు. అందువల్ల రియల్టీ రంగాన్ని ఆదుకునేందుకు ఆర్​బీఐ సహకారం అందించాలన్నారు. వచ్చే ఏడాది వార్షిక బడ్జెట్​లో ఆ దిశగా కేంద్రం చర్యలు ఉండాలని కోరారు.

కేంద్రం సాయం..

రియల్టీ డెవలపర్లు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని తొలగించేందుకు కేంద్రం ఇప్పటికే.. రెరా కింద ప్రాజెక్టులను 6 నెలల్లో పూర్తి చేయాలనే నిబంధనను 9 నెలలకు పెంచింది .

మధ్యస్థ ఆదాయం ఉన్న గ్రూప్​లకు వడ్డీ రాయితీని 2021 మార్చి వరకు పొడిగించింది. వలస వచ్చిన వారికి తక్కువ అద్దెకు ఇల్లు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చింది. ఒకసారి రుణాల పునర్​వ్యవస్థీకరణకు అనుమతులు ఇచ్చింది.

ఇదీ చూడండి:కొత్త ఏడాదిలో బంగారం ధరకు రెక్కలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.