ETV Bharat / business

పేటీఎంకు ఆర్​బీఐ షాక్‌- కొత్త కస్టమర్లు చేర్చుకోవడంపై బ్యాన్ - పేటీఎంకు ఆర్​బీఐ కొత్త ఆదేశాలు

RBI on paytm payment bank:పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​పై ఆర్​బీఐ నిషేధం విధించింది. కొత్తగా కస్టమర్లను చేర్చుకోవద్దని సంస్థను ఆదేశించింది.

PayTM Payments Bank
పేటీఎం
author img

By

Published : Mar 11, 2022, 7:18 PM IST

Updated : Mar 11, 2022, 8:33 PM IST

RBI on paytm payment bank: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకులో కొత్తగా కస్టమర్లను చేర్చుకోవడం తక్షణమే ఆపేయాలని పేటిఎంను భారతీయ రిజర్వ్​ బ్యాంక్​ ఆదేశించింది. ఐటీ సిస్టమ్‌పై పూర్తి స్థాయిలో ఆడిట్ జరిపేందుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని పేటీఎంకు సూచించింది.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లోని సెక్షన్ 35ఏ ప్రకారం ఆర్​బీఐకు ఉన్న విశిష్ఠ అధికారాలను ఉపయోగించుకుంటూ కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేటీఎం కు ఆర్​బీఐ ఆదేశించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవడం ఆర్​బీఐ మంజూరు చేసే అనుమతులకు లోబడి ఉంటుందని ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంకు 2015లో ఏర్పాటైంది. పేమెంట్స్ బ్యాంక్ నడిపేందుకు ఆర్‌బీఐ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత 2017 నవంబర్‌లో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సేవలు ప్రారంభమయ్యాయి.

గతంలో హెచ్​డీఎఫ్​సీపై కూడా ఇలాంటి ఆంక్షలనే విధించింది ఆర్​బీఐ. 2020 డిసెంబర్​లో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ కొత్త డిజిటల్ ఉత్పత్తులను లేదా సేవలను ప్రారంభించకూడదని ఆదేశించింది. వినియోగదారులకు రుణాలు ఇవ్వడంలో పునరావృతమయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించే వరకు కొత్త క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయకుండా హెచ్​డీఎఫ్​సీ పై నిషేధించింది.

ఇదీ చూడండి:

క్రెడిట్ కార్డ్​ ఉందా? ఈ ఆఫర్స్ అస్సలు మిస్​ అవ్వొద్దు!

కొత్త ఆర్థిక సంవత్సరం వస్తోంది.. 'మనీ ప్లాన్'​ సిద్ధమా?

హోం లోన్​ ట్రాన్స్​ఫర్​ చేయాలా? ఇవి తప్పనిసరి!

Last Updated : Mar 11, 2022, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.