ETV Bharat / business

ఐసీఐసీఐ బ్యాంక్​కు రూ.3 కోట్లు జరిమానా

ఐసీఐసీఐ బ్యాంక్​కు రూ.3 కోట్లు జరిమాన విధించింది రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. ఆర్​బీఐ జారీ చేసిన మార్గదర్శకాలను సదరు సంస్థ పాటించకపోవడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ICICI Bank, rbi
ఐసీఐసీఐ బ్యాంక్​కు రూ.3కోట్ల జరిమానా
author img

By

Published : May 3, 2021, 9:37 PM IST

ఐసీఐసీఐ బ్యాంక్​కు భారతీయ రిజర్వ్​ బ్యాంక్​ (ఆర్​బీఐ) జరిమాన విధించింది. వ్యవస్థాగతంగా కొన్ని మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్​బీఐ తెలిపింది.

2015, జూలై 1 నాటి బ్యాంకుల వర్గీకరణకు సంబంధించిన మూల్యాంకణ ప్రకారం ఆర్​బీఐ జారీ చేసిన కొన్ని మార్గదర్శకాలకు విరుద్ధంగా ఐసీఐసీఐ బ్యాంక్​ వ్యవహరించిందని.. ఈ కారణంగా జరిమానా విధించినట్లు ఓ ప్రకటలో తెలిపింది.

సెక్యూరిటీలను ఒక కేటగిరి నుంచి మరొక కేటగిరికి మార్చడంలో ఈ లోపాలను గుర్తించినట్లు ఆర్​బీఐ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేసిన రిజర్వ్​ బ్యాంక్​.. వాటిని పాటించడంలో విఫలమైనందున ఎందుకు జరిమానా విధించకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

ఇదీ చూడండి: ఏప్రిల్​లో ఫ్లాట్​గా తయారీ రంగ పీఎంఐ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.