ETV Bharat / business

నోట్లరద్దు దేశంపై జరిగిన ఉగ్రదాడి: రాహుల్​ గాంధీ

పెద్ద నోట్ల రద్దుకు నేటితో మూడేళ్లయింది. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై విపక్ష నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. నోట్లరద్దు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన చర్యగా ఆరోపించారు. ఇది ఓ మనిషి (మోదీ) సృష్టించిన విపత్తుగా అభివర్ణించారు రాహుల్​ గాంధీ.

నోట్లరద్దు దేశంపై జరిగిన ఉగ్రదాడి: రాహుల్​ గాంధీ
author img

By

Published : Nov 8, 2019, 1:41 PM IST

Updated : Nov 8, 2019, 4:33 PM IST

నోట్లరద్దు దేశంపై జరిగిన ఉగ్రదాడి: రాహుల్​ గాంధీ

నోట్లరద్దు అమలై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వివిధ పార్టీల నేతలు.. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోదీ అనాలోచిత నిర్ణయం వల్ల దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని దుయ్యబట్టారు.

ఉగ్రదాడి...

'నోట్ల రద్దు'ను 'ఉగ్రదాడి'గా అభివర్ణించారు కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ. ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిన అవసరం ఉందన్నారు.

rahul gandhi tweet

"భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన, అనేక మంది ప్రాణాలు తీసిన, లక్షలాది చిరు వ్యాపారులను తుడిచిపెట్టి, ఎంతోమంది భారతీయులను నిరుద్యోగులుగా చేసిన నోట్ల రద్దు అనే ఉగ్రదాడి జరిగి నేటికి మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ దుర్మార్గపు దాడి వెనుక ఉన్నవారికి శిక్ష పడాల్సిన అవసరం ఉంది."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ నేత ట్వీట్​

విపత్తు

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు ఆర్థికవ్యవస్థను నాశనం చేసిన విపత్తుగా అభివర్ణించారు.

priyanka gandhi tweet
నోట్ల రద్దుతో దేశ ఆర్థికవ్యవస్థ నాశనమైంది: ప్రియాంక గాంధీ

నోట్ల రద్దే కారణం...

గ్లోబల్​ రేటింగ్ ఏజెన్సీలు భారత రేటింగ్​ను తగ్గించడానికి, ఓ మనిషి సృష్టించిన విపత్తు (నోట్ల రద్దు) కారణమని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా ఆరోపించారు. నోట్ల రద్దు జరిగి మూడేళ్లు అవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు.

randeep
నోట్లరద్దుపై రణదీప్​ సుర్జేవాలా విమర్శలు
randeep tweet
మోదీపై రణదీప్​ సుర్జేవాలా విమర్శలు

రూ.2000 నోట్లు రద్దు చేయాలి...

నల్లధనాన్ని వెలికితీయడానికి పెద్ద నోట్లను రద్దు చేసిన మోదీ ప్రభుత్వం... అది సాధించలేకపోయిందని మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్​సీ గార్గ్​ విమర్శించారు. వెంటనే ఈ అధిక విలువ కలిగిన నోట్లను (రూ.2000) రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

"నల్లధనాన్ని అరికట్టడం, డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించడానికే రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశామని మోదీ తెలిపారు. అయితే వాటి స్థానంలో రూ.2000 నోట్లు తీసుకొచ్చారు. దేశాన్ని తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థగా మార్చడమంటే ఇదేనా?"

- ఎస్​సీ గార్గ్, మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి

ముందే చెప్పానా?

mamata
నోట్ల రద్దు ప్రజల జీవితాలను నాశనం చేసింది: మమతా బెనర్జీ ట్వీట్​

"నోట్లరద్దు చేసిన కొద్ది క్షణాల్లోనే.. ఇది ఆర్థికవ్యవస్థను, లక్షలాది ప్రజల జీవితాలను నాశనం చేస్తుందని చెప్పాను. ఇప్పుడు ప్రఖ్యాత ఆర్థికవేత్తలు, సామాన్య ప్రజలు, ఆర్థిక నిపుణులు కూడా దీనిని అంగీకరిస్తున్నారు. ఆర్​బీఐ గణాంకాలు కూడా ఇది వ్యర్థమైన చర్య అని స్పష్టం చేస్తున్నాయి."

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి ట్వీట్​

ఇదీ చూడండి: 'వెనక్కి తగ్గేది లేదు- చెరిసగంపై హామీ ఇస్తేనే చర్చలు'

New Delhi, Nov 08 (ANI): Prime Minister Narendra Modi, Home Minister Amit Shah and Vice President Venkaiah Naidu reached at LK Advani's residence on his 92nd birthday. Veteran BJP leader and former Deputy Prime Minister, LK Advani turned 92 today. Advani was born on 8 November in 1927 in Karachi in undivided India. After partition, his family moved to India. He is a founder member of the BJP along with former prime minister Atal Bihari Vajpayee, who died on 16 August, 2018. He was also the BJP's longest serving president.

Last Updated : Nov 8, 2019, 4:33 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.