ETV Bharat / business

పెట్రోల్ ధర అత్యధికంగా తగ్గింది ఈ రాష్ట్రంలోనే... - పెట్రోల్ రేటు

కేంద్రం ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించడం(Petrol excise duty reduction), రాష్ట్రాలు వ్యాట్​పై (Petrol VAT rate) కోత విధించడం వల్ల.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్​ ధర రూ.16 మేర తగ్గింది. అదే సమయంలో డీజిల్ ధర అత్యధికంగా రూ.19.61 మేర పడిపోయింది. ఏఏ రాష్ట్రాల్లో అత్యధికంగా పెట్రోల్ రేట్లు తగ్గాయంటే...

PETROL RATES reduction
PETROL RATES reduction
author img

By

Published : Nov 14, 2021, 4:36 PM IST

పెట్రోల్​, డీజిల్​పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించిన తర్వాత వివిధ రాష్ట్రాలు సైతం స్థానికంగా విధించే వ్యాట్​, సేల్స్ ట్యాక్స్​ను తగ్గిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం దేశంలోనే అత్యధికంగా పెట్రోల్​పై వ్యాట్​ను (Petrol rate in Punjab) తగ్గించింది. లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో డీజిల్​పై అత్యధికంగా వ్యాట్​ తగ్గింది.

లీటర్ పెట్రోల్​పై రూ.5, డీజిల్​పై రూ.10 తగ్గిస్తున్నట్లు దీపావళి సందర్భంగా కేంద్రం (Petrol excise duty reduction) ప్రకటించింది. ఆ తర్వాత 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రాంతీయంగా విధించే వ్యాట్​ను తగ్గించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్​పై రూ. 16.02, డీజిల్​పై రూ.19.61 మేర తగ్గినట్టైంది.

అధికంగా పంజాబ్​లో

అత్యధికంగా పంజాబ్​లోనే పెట్రోల్ రేట్లు (Petrol rate reduction) తగ్గాయి. లీటర్​ పెట్రోల్​ ధర పంజాబ్​లో రూ.16.02 (Petrol rate in Punjab) తగ్గింది. ఆ తర్వాత లద్దాఖ్​లో రూ.13.43, కర్ణాటకలో రూ.13.35 మేర పెట్రోల్ ధర తగ్గింది.

పెట్రోల్​పై వ్యాట్ తగ్గుదల సైతం పంజాబ్​లోనే అధికంగా కనిపించింది. పలు రాష్ట్రాల్లో తగ్గిన వ్యాట్ వివరాలు ఇలా ఉన్నాయి..

రాష్ట్రంతగ్గిన వ్యాట్
పంజాబ్రూ.11.27
ఉత్తర్​ప్రదేశ్రూ.6.96
గుజరాత్రూ.6.82
ఒడిశారూ.4.55
బిహార్రూ.3.21

డీజిల్ ధర అత్యధికంగా తగ్గింది ఈ రాష్ట్రాల్లోనే(కేంద్రం తగ్గించిన రూ.10కి అదనంగా)

రాష్ట్రం/ప్రాంతంతగ్గిన మొత్తం
లద్దాఖ్రూ.9.52
కర్ణాటకరూ.9.30
పుదుచ్చేరిరూ.9.02

డీజిల్​పై అత్యధికంగా వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలు

రాష్ట్రంతగ్గించిన మొత్తం
మధ్యప్రదేశ్రూ.6.96
పంజాబ్రూ.6.77
ఒడిశారూ.5.69
బిహార్రూ.3.91
ఉత్తర్​ప్రదేశ్రూ.2.04
ఉత్తరాఖండ్రూ.2.04
హరియాణారూ.2.04

ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రాజస్థాన్​ (Petrol rate Rajasthan) రాజధాని జైపుర్​లో రూ.111.10గా ఉంది. దేశంలో ఇదే అత్యధికం. ఆ తర్వాత స్థానాల్లో ముంబయి(రూ.109.98), ఆంధ్రప్రదేశ్ (రూ.109.05) ఉన్నాయి. కర్ణాటక(రూ.100.58), బిహార్(రూ.105.90), మధ్యప్రదేశ్(రూ.107.23), లద్దాఖ్(రూ.102.99) మినహా చాలా వరకు భాజపా పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ.100 లోపే ఉన్నాయి.

డీజిల్ ధర సైతం రాజస్థాన్​లోనే(రూ.95.71) అత్యధికంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్(రూ.95.18), తెలంగాణ(రూ.94.62) ఉన్నాయి.

కాంగ్రెస్​, కాంగ్రెస్ మిత్ర పక్షాలు పాలిస్తున్న రాజస్థాన్, ఛత్తీస్​గఢ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, తమిళనాడు సహా బంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెట్రోల్​పై వ్యాట్ తగ్గించలేదు.

ఇదీ చదవండి: Gold Price Today: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.