ETV Bharat / business

కరోనా నిర్ధరణకు దేశీయంగా పరీక్ష కిట్ తయారీ - కరోనా వైరస్ వార్తలు

కరోనా వ్యాధి నిర్ధరణకు పరీక్ష కిట్​ను పుణెకు చెందిన మైల్యాబ్​ దేశీయంగా రూపొందించింది. దిగుమతి చేసుకునేవాటి కన్నా తక్కువ ఖర్చు, సమయంతో పాటు ఎక్కువ మందిని ఈ కిట్​తో పరీక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నూతన కిట్లకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆమోదం తెలిపింది.

mylab
కిట్​
author img

By

Published : Mar 24, 2020, 7:55 PM IST

కరోనా వైరస్ వ్యాధి నిర్ధరణకు స్వదేశీ పరిజ్ఞానంతో పరీక్ష కిట్​ను తయారు చేసింది పుణెకు చెందిన మైల్యాబ్స్​ సంస్థ. ఈ కిట్​తో వైరస్​ నిర్ధరణ ఫలితాలు మరింత తక్కువ సమయంలోనే వస్తాయని తెలిపింది మైల్యాబ్​. దీనికి భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) ఆమోదం లభించింది.

పుణె జిల్లా లోణావాలాలోని సంస్థకు చెందిన తయారీ కేంద్రంలో రోజుకు 15వేల కిట్ల తయారీ సాధ్యమవుతుందని మైల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ పటోలే తెలిపారు. త్వరలోనే ఈ సామర్థ్యాన్ని 25 వేలకు పెంచుతామని స్పష్టం చేశారు.

"మేము తయారు చేసిన 'మైల్యాబ్ పాతోడిటెక్ట్​ కొవిడ్​- 19 క్వాలిటేటివ్ పీసీఆర్ కిట్​'తో 2.5 గంటల్లో వ్యాధి నిర్ధరణ చేయవచ్చు. ప్రస్తుతం మనం దిగుమతి చేసుకుంటున్న కిట్లతో దాదాపు 10 గంటల సమయం పడుతోంది."

- శ్రీకాంత్ పటోలే, మైల్యాబ్ సహ వ్యవస్థాపకుడు

వైరస్ నిర్ధరణలో ఆలస్యం కూడా కరోనా వ్యాప్తికి కారణమవుతుందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) స్పష్టం చేసినట్లు శ్రీకాంత్ గుర్తుచేశారు. ఈ కిట్​ తయారీకి 25 మంది శాస్త్రవేత్తలు కృషిచేయగా.. సంస్థ తరఫున రూ.25 కోట్లు ఖర్చు చేశామని ఆయన తెలిపారు.

100 మందికి ఒక కిట్​..

మైల్యాబ్ తయారుచేసిన ఈ కిట్​తో 100 మందిని పరీక్షించవచ్చని మైల్యాబ్ శాస్త్రవేత్త రంజిత్ దేశాయ్ తెలిపారు. ఒక్క కిట్ ఖరీదు రూ.80 వేలుగా ఉంటుందన్నారు. దిగుమతి చేసుకునేవాటితో పోల్చితే దీని ధర 25 శాతం మాత్రమేనని పేర్కొన్నారు.

22 ప్రైవేట్ కేంద్రాలు..

దేశంలో 22 ప్రైవేటు ల్యాబ్​లకు కరోనా పరీక్షలు చేసేందుకు ఐసీఎంఆర్​ వద్ద నమోదు చేసుకున్నాయి. వీటిద్వారా 15,500 శాంపిళ్లను పరీక్షించవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీటితో పాటు 118 ప్రభుత్వ లేబొరేటరీలు ఉన్నాయని వెల్లడించారు. ప్రభుత్వ లేబొరేటరీల్లో రోజుకు 12 వేల శాంపిళ్లను పరీక్షించవచ్చని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.