ETV Bharat / business

ఆరునెలల్లో పబ్​జీ ఆదాయం రూ. 9వేల కోట్లు - pubg latest news

పాపులర్​ ఆన్​లైన్​ వీడియో ​గేమ్​ పబ్​జీ... ఈ ఏడాది 6 నెలల్లో రూ. 9వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గరేన, నెట్​ఈజ్​లు పబ్​జీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మేరకు అనలిటిక్స్​ సంస్థ సెన్సార్​ టవర్ తెలిపింది. కరోనా భయాలతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం రికార్డు స్థాయిలో ఆదాయం పెరగడానికి కారణమని తెలుస్తోంది.

PUBG Mobile's revenue reached to $3 billion (roughly Rs 9,731 crore) globally, India topped the list with 175 million installs
ఆరునెలల్లో పబ్​జీ ఆదాయం రూ. 9వేల కోట్లు
author img

By

Published : Jul 5, 2020, 6:06 AM IST

Updated : Jul 5, 2020, 7:07 AM IST

ప్రముఖ ఆన్​లైన్​ గేమ్​ పబ్​జీ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 1.3 బిలియన్​ డాలర్లు(రూ. 9,731కోట్లు) ఆదాయాన్ని వసూలు చేసింది. పబ్​జీ రెవెన్యూ 3 బిలియన్​ డాలర్లకు(రూ.22,457కోట్లు) చేరింది. అయితే కరోనా భయాలు నడుమ ప్రజలు ఇళ్లకే పరిమితమవడం వల్ల మార్చి నెలలో పబ్​జీ అత్యధికంగా రూ. 2,021కోట్లు లాభాన్ని ఆర్జించింది. ఈ మేరకు అనలిటిక్స్​ సంస్థ సెన్సార్ టవర్​ వెల్లడించింది. 1.75కోట్ల డౌన్​లోడ్​లతో ప్రపంచంలోనే భారత్​ నుంచి ఎక్కువ మంది పబ్​జీని ఇన్​స్టాల్​ చేసుకున్నారు.​

సెన్సార్​ టవర్ ​డేటా ప్రకారం... 2020లో పబ్​జీ తర్వాత సింగపూర్​కు చెందిన గరేన సంస్థ 300 మిలియన్​ డాలర్లు(రూ .2,245 కోట్లు), నెట్‌ఈజ్​కు చెందిన నైవ్స్​అవుట్​ 260 మిలియన్​ డాలర్లు(రూ. 1,946 కోట్లు), యాక్టివిజన్​ కాల్​ ఆఫ్​ డ్యూటీ 220 మిలియన్ డాలర్ల (రూ.1,646 కోట్లు) ఆదాయాన్ని పొందాయి.

పబ్​జీని అందుకే భారత్​ బ్యాన్​ చేయలేదు

ఈ యాప్​ పూర్తిగా చైనా కంపెనీకి చెందినది కాదు. దీన్ని తయారు చేసి యాప్​ నిర్వహణ చూస్తోంది బ్లూ హోల్​ అనే దక్షిణ కొరియా సంస్థ. అయితే ఈ గేమ్​ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత చైనాకు చెందిన టెన్సెంట్​ సంస్థ.. బ్లూ హోల్​తో కలిసింది. చైనా, భారత్​లో ఈ గేమ్​ను మార్కెటింగ్​ వ్యవహారాలను టెన్సెంట్​ చూసుకుంటోంది. ఇలా మిక్స్​డ్​ ఓనర్​షిప్​ వల్ల ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.

ఇదీ చూడండి: 'భారత్​పై చైనా డేటా అస్త్రం- స్వయం సమృద్ధే పరిష్కారం!'

Last Updated : Jul 5, 2020, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.