ETV Bharat / business

'అన్ని సమస్యలకు ప్రైవేటీకరణ పరిష్కారం కాదు'

ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయటంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్​బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా. అన్ని సమస్యలకు ప్రైవేటీకరణ పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగంలోనే సంస్థలను కొనసాగిస్తూ.. నిర్వహణ స్వేచ్ఛ, యాజమాన్య హక్కులను వేరుచేస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు.

Privatisation not panacea for all ills : ex-RBI dep guv
'అన్ని సమస్యలకు ప్రైవేటీకరణ పరిష్కారం కాదు'
author img

By

Published : Feb 13, 2021, 7:18 AM IST

అన్ని సమస్యలకు ప్రైవేటీకరణ ఒక్కటే పరిష్కారమనేది అపోహ మాత్రమేనని ఎప్పుడో తేలిందని రిజర్వు బ్యాంక్​ ఆఫ్ ఇండియా(ఆర్​బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలోనే సంస్థలను కొనసాగిస్తూ, నిర్వహణ స్వేచ్ఛ, యాజమాన్య హక్కులను వేరుచేస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. బంగాల్ ఛాంబర్​ నిర్వహించిన వెబినార్​లో ఆయన మాట్లాడారు. సంస్థల పనితీరును యాజమాన్య హక్కుల మార్పిడి మారుస్తుందన్న ఆలోచన సహేతుకంకాదని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ నష్టపోతున్న సంస్థలున్నాయని గుర్తు చేశారు.

'భారత్​లో బ్యాంకింగ్ వాతావరణం గురించి చాలామంది చాలా చెప్పారు. కొన్ని దశాబ్దాల్లో ప్రపంచ దేశాల్లో, భారత్​లో బ్యాంకులకు ఎదురుదెబ్బలు కొనసాగుతున్నాయి. ఆర్థిక సంస్థకు ప్రభుత్వాల హామీ లభించటమే అన్నింటికీ కారణం'

--- ఎస్ఎస్ ముంద్రా, ఆర్​బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్

వృద్ధికి అవకాశం ఉన్నా కూడా మూలధనం కొరత ఎదురవుతోందని, వేర్వేరు రంగాల నుంచి డిమాండ్లు రావటం ఇందుకు కారణమని వివరించారు.

ఇదీ చదవండి : డిసెంబర్​లో పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.