ETV Bharat / business

రోజుకు 10 లక్షల వ్యాక్సిన్లు- 'అపోలో' కరోనా ప్లాన్​

రోజుకు 10 లక్షల కరోనా వ్యాక్సిన్​లను ప్రజలకు సురక్షితంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు అపోలో హాస్పిటల్స్​ గ్రూప్​ ప్రకటించింది. ఇందుకోసం తమ నిపుణులకు శిక్షణ ఇచ్చినట్టు స్పష్టం చేసింది. కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వానికి తమవంతు సహాయం చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు అపోలో గ్రూప్​ వెల్లడించింది.

Prepared to administer 1 mn COVID-19 vaccines a day: Apollo Hospitals Group
'రోజుకు 10లక్షల వ్యాక్సిన్ల సరఫరాకు అపోలో రెడీ'
author img

By

Published : Oct 15, 2020, 5:27 PM IST

కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వానికి తమ వంతు సహాయం చేసేందుకు అపోలో హాస్పిటల్స్​ గ్రూప్​ ముందుకొచ్చింది. వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చిన అనంతరం.. రోజుకు 10 లక్షల డోసులను ప్రజలకు సురక్షితంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.

తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్​ లభించే విధంగా ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్​ వైస్​ ఛైర్మన్​ శోభన కామినేని వెల్లడించారు. ఇందుకోసం ఫార్మసీలు, క్లినిక్స్​, దేశవ్యాప్తంగా ఉన్న తమ ఆసుపత్రుల్లోని 10వేల మంది నిపుణులకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు.

"దేశవ్యాప్తంగా అపోలో నెట్​వర్క్​ విస్తరించి ఉంది. దాదాపు 30 శాతం మంది ప్రజలు అపోలో కేంద్రానికి కేవలం 30 నిమిషాల దూరంలో ఉన్నారు. రోజుకు 10 లక్షల డోసులను అందించే సామర్థ్యం ప్రతి కేంద్రానికి ఉంది. ఈ మేరకు ప్రభుత్వ మార్గదర్శకాలతో వ్యాక్సిన్​ను అందించేందుకు నిపుణులకు శిక్షణ ఇచ్చాం."

--- శోభన కామినేని, అపోలో గ్రూప్​ ఎగ్జిక్యూటివ్​ వైస్​ ఛైర్మన్​.

వ్యాక్సిన్​ను ఉంచేందుకు కావాల్సిన శీతల గిడ్డంగి వ్యవస్థను బలోపేతం చేసినట్టు.. టీకాను సురక్షితంగా రవాణా చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు శోభన వెల్లడించారు.

అపోలో హాస్పిటల్స్​ గ్రూప్​ ఆధ్వర్యంలో ప్రస్తుతం.. 19 ఔషధాల సరఫరా కేంద్రాలు, 70 ఆసుపత్రులు, 400 క్లినిక్​లు, 500 కార్పొరేట్​ హెల్త్​ సెంటర్లు, 4,000 ఫార్మసీలతో పాటు అపోలో 24/7 డిజిటల్​ ప్లాట్​ఫాం ఉన్నాయి.

ఇదీ చూడండి:- కరోనా టీకా సింగిల్​ డోస్​.. కేవలం 75 రూపాయలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.