ETV Bharat / business

బిల్​గేట్స్​ పొలాలు​ ఇంత పెద్దవా! - మెక్​డొనాల్డ్​

దిగ్గజ వ్యాపారవేత్త బిల్​గేట్స్​కు.. మెక్​డీలో లభించే ఫ్రెంచ్​ ఫ్రైస్​కు ఓ సంబంధం ఉంది. రుచికరంగా ఉండే ఈ ఫ్రైస్​కు తయారీకి కావాల్సిన బంగాళదుంపలను గేట్స్​కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తారని ఓ ఆంగ్ల మీడియా సంస్థ వెల్లడించింది. ఈ క్షేత్రాలు అంతరిక్షం నుంచి చూసినా కనపడతాయని పేర్కొంది.

bill gates
గేట్స్​
author img

By

Published : Jul 11, 2021, 10:38 AM IST

Updated : Jul 11, 2021, 12:06 PM IST

దిగ్గజ వ్యాపారవేత్త బిల్​గేట్స్​ బిలియనీర్​ అని అందరికి తెలిసిన విషయమే. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన మరో విషయం బయటకు వచ్చింది. అమెరికా వాషింగ్టన్​లో ఆయనకున్న వ్యవసాయ క్షేత్రాలు.. అంతరిక్షం నుంచి చూసినా కనపడతాయట! మెక్​డొనాల్డ్స్​ ఫ్రైస్​ తయారీలో వాడే బంగాళదుంపలను ఈ క్షేత్రాల్లో పండిస్తారట. ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా వెల్లడించింది.

మొత్తం మీద అగ్రరాజ్యంలోని 18రాష్ట్రాల్లో బిల్​ గేట్స్​కు 2,69,000కుపైగా వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఆయన సొంత భూములు కాగా.. మరికొన్ని ఆయన పెట్టుబడుల సంస్థ కాస్కేడ్​కు చెందినవి.

ప్రపంచ ధనికుల జాబితాలో బిల్​గేట్స్​ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నారు. తన భార్య మిలిందా గేట్స్​తో విడాకులు తీసుకోనున్నట్టు ఇటీవలే గేట్స్​ ప్రకటించారు.

ఇదీ చూడండి:- ఈ పాప ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Last Updated : Jul 11, 2021, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.