దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్ ధర రూ. 100 మార్కుని దాటింది.
తెలుగురాష్ట్రాల్లో పెరిగిన పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి...
- హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర్కు 35 పైసలు పెరిగి.. రూ.104.20 వద్దకు చేరింది. డీజిల్ ధర 17 పైసలు పెరిగి రూ.97.64 వద్ద కొనసాగుతుంది.
- గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.106.42 ఉండగా.. డీజిల్ రూ.99.29కు చేరింది.
- వైజాగ్లో పెట్రోల్ ధర లీటర్ రూ.105.23 వద్ద ఉండగా.. లీటర్కు డీజిల్ ధర రూ.98.13 వద్ద కొనసాగుతుంది.
మెట్రో నగరాల్లో పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి..
- దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 100.27 ఉండగా.. డీజిల్ రూ. 89.59 గా ఉంది.
- ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ. 106.31 గా ఉండగా.. డీజిల్ ధర 97.15 కు చేరింది.
- చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 101.11, డీజిల్ రూ. 94.12గా ఉంది.
- కోల్కత్తాలో లీటర్ పెట్రల్ ధర రూ. 100.29, డీజిల్ ధర రూ. 92.56 కు చేరింది.