ETV Bharat / business

వరుసగా నాలుగో రోజూ పెరిగిన పెట్రో ధరలు - దిల్లీలో పెట్రోల్ ధర

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్ 40 పైసలు, డీజిల్ ధర 45 పైసలు పెరిగింది. వరుసగా నాలుగు రోజుల్లో పెట్రోల్​ ధర (లీటర్​పై) రూ.2.14, డీజిల్ ధర (లీటర్​పై) రూ.2.23 పెరిగింది.

petrol price hike
పెరిగిన పెట్రోల్ ధరలు
author img

By

Published : Jun 10, 2020, 10:41 AM IST

పెట్రోల్​, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర (దిల్లీలో) 40 పైసలు పెరిగి రూ.73.40కు చేరింది. డీజిల్ ధర లీటర్​కు 45 పైసలు పెరిగి రూ.71.62 వద్దకు చేరింది.

ఈ నాలుగు రోజుల్లో పెట్రోల్​ ధర (లీటర్​పై) రూ.2.14, డీజిల్ ధర (లీటర్​పై) రూ.2.23 పెరిగింది.

లాక్​డౌన్ నేపథ్యంలో దాదాపు 82 రోజుల తర్వాత రోజువారీ చమురు ధరల సవరణలను ఆదివారం నుంచి పునరుద్ధరించాయి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా వరుసగా నాలుగో రోజూ పెట్రోల్​, డీజిల్ ధరలను పెంచాయి.

దేశవ్యాప్తంగా ఇత ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర బుధవారం సగటున 40 పైసలు, డీజిల్ ధర 40-60 పైసల మధ్య పెరిగింది.

ప్రధననగరాల్లో ఇంధన ధరలు (లీటర్​కు)

నగరంపెట్రోల్డీజిల్
హైదరాబాద్ రూ.76.09 రూ.69.98
బెంగళూరురూ.75.67రూ.68.12
ముంబయిరూ.80.44రూ.70.38
చెన్నైరూ.77.66 రూ.70.38
కోల్​కతారూ.75.42 రూ.67.79

సుంకాల వడ్డింపు..

అంతర్జాతీయ మార్కెట్​లో అనిశ్చితి కారణంగా విమాన ఇంధనం ఏటీఎఫ్, వంటగ్యాస్​ ధరలను క్రమంగా సవరించాయి. పెట్రో ధరలపై మాత్రం మార్చి 16 నుంచి ఎలాంటి మార్పులు చేయలేదు. అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్​ సుంకాలను వడ్డించింది కేంద్ర ప్రభుత్వం. తొలుత రూ.3 సుంకం పెంచిన కేంద్రం, అనంతరం పెట్రోల్​పై రూ.10, డీజిల్​పై రూ.13 పెంచింది.

ఆయిల్​ కంపెనీలు కూడా బీఎస్​-6 విధానానికి మారిన తర్వాత ఇదే సూత్రాన్ని పాటించాయి. అంతర్జాతీయంగా తగ్గిన ధరల నుంచి లాభాలను స్వీకరించి.. ఆ లాభాలను వినియోగదారులకు బదిలీ చేయలేదు. అయితే ఇటీవల పెరిగిన చమురు ధరల భారాన్ని మాత్రం వినియోగదారులపై మోపుతున్నాయి.

ఇదీ చూడండి:ఈ బ్యాటరీతో భూమిని 100 సార్లు చుట్టేయొచ్చట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.