ETV Bharat / business

భగ్గుమన్న 'పెట్రోల్​'- దేశంలో ఆల్​టైమ్​ రికార్డ్​

దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర 23 పైసలు పెరిగి.. రూ. 84.20కు చేరింది. ఫలితంగా దేశంలో పెట్రల్​ ధరలు ఆల్​టైమ్​ రికార్డును అధిగమించాయి. మరోవైపు ముంబయిలో లీటర్​ డీజిల్​ ధర రికార్డు స్థాయిలో 81.07కు పెరిగింది.

Petrol price at all time record
భగ్గుమన్న 'పెట్రోల్​'- దేశంలో ఆల్​టైమ్​ రికార్డ్​
author img

By

Published : Jan 7, 2021, 11:17 AM IST

దేశంలో పెట్రోల్​ ధరలు గురువారం ఆల్​టైమ్​ రికార్డు సృష్టించాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్ ధర 23పైసలు పెరిగి.. రూ. 84.20కు చేరుకుంది. రాష్ట్రాల ఆధారిత ఇంధన రిటైలర్లు పెట్రోల్​ రేట్లను వరుసగా రెండో రోజూ పెంచడమే ఇందుకు కారణం.

దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర బుధవారం 26 పైసలు పెరిగి.. రూ.83.97 వద్దకు చేరింది. 2018 అక్టోబర్ 4న పెట్రోల్ ధర లీటర్​ రూ.84 వద్దకు చేరి జీవనకాల రికార్డ్ స్థాయిని తాకింది.

ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీల ప్రకారం డీజిల్​ 26 పైసలు పెరిగింది. దిల్లీలో లీటర్​ డిజిల్​ ధర 74.38కు చేరింది. ముంబయిలో లీటర్​ పెట్రోల్​ 90.83, లీటర్​ డీజిల్​ 81.07కు పెరిగింది. డీజిల్​ పరంగా ముంబయిలో ఇది ఆల్​టైమ్​ రికార్డు.

ఇదీ చూడండి:- టీకా రాకతో ఆర్థికవ్యవస్థ భారీ రికవరీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.