పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ ధర గురువారం (దిల్లీలో) 25 పైసలు పెరిగి రూ.87.85 వద్దకు చేరింది. డీజిల్ ధర కూడా లీటర్ రూ.78.03 వద్ద ఉంది.
ముంబయిలో పెట్రోల్ ధర(లీటర్కు) ఏకంగా రూ.94.36కు పెరిగింది. లీటర్ డీజిల్ ధర రూ.84.94గా ఉంది. ముంబయిలో లీటర్ డీజిల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.
దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు 25 పైసల వరకు పెరిగాయి. డీజిల్ ధర 30 పైసల మధ్య పెరిగింది.