ETV Bharat / business

ఆల్​టైం హై వద్ద పెట్రోల్ రేట్లు​- సామాన్యులపై భారం తగ్గేదెలా?

దేశంలో వరుసగా పెరుగుతున్న పెట్రోల్​, డీజిల్ ధరలు సామాన్యులకు మోయలేని భారంగా మారుతున్నాయి. చమురు ధరలు ఈ స్థాయిలో పెరిగేందుకు కారణాలు ఏమిటి? ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం ఏం చేయలేదా? జీఎస్​టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకురావడం ద్వారానే ధరలకు కళ్లెం వేయడం సాధ్యమా?

author img

By

Published : Oct 3, 2021, 6:10 PM IST

Updated : Oct 3, 2021, 6:49 PM IST

Petrol diesel prices at all time high
ఆల్​టైం హై వద్ద పెట్రోల్​, డీజిల్ ధరలు

దేశంలో పెట్రోల్​, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే సెంచరీ కొట్టిన లీటర్​ పెట్రోల్​ ధర.. రికార్డులు బద్దలుకొడుతూ ఇంకా ముందుకు సాగుతూనే ఉంది. డీజిల్ ధర కూడా తాజాగా పలు నగరాల్లో సెంచరీ దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్ ధరలు ఆల్​టైం రికార్డు స్థాయి వద్ద కొనసాగుతన్నాయి.

ప్రస్తుత ధరలు ఇలా..

దిల్లీలో.. ఆదివారం (అక్టోబర్​ 3) పెట్రోల్​ ధర లీటర్​కు 25 పైసలు పెరగ్గా.. డీజిల్ (లీటర్​)​ 30 పైసలు పుంజుకుంది. దీనితో లీటర్ పెట్రోల్​ ధర రూ.102.39 వద్దకు చేరింది. డీజిల్ ధర రూ.90.77 వద్దకు చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం ఇది వరుసగా నాలుగో రోజు కావడం గమనార్హం.

ధరల పెరుగుదలకు కారణాలు ఏమిటి?

సాధారణంగా పెట్రోల్, డీజిల్​ ధరలను అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు తగ్గట్లుగా.. రోజువారీగా సవరిస్తుంటాయి దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు(ఓఎంసీలు). 2017లో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టింది కేంద్రం. ఇందులో భాగంగానే.. ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్​ ధరలు క్రమంగా పెరుగుతూ వస్తుండగా.. ఆ భారాన్ని వినియోగదారులకూ బదిలీ చేస్తున్నాయి ఓఎంసీలు.

బ్యారెల్​ ముడి చమురు ధర ప్రస్తుతం మూడేళ్ల గరిష్ఠమైన 76.71 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా బ్యారెల్ పెట్రోల్​ ధర ఒక్క రోజులోనే 85.95 డాలర్ల నుంచి 87.11 డాలర్లకు పెరిగింది. డీజిల్ కూడా బ్యారెల్​కు 85.95 డాలర్ల నుంచి 87.27 డాలర్లకు ఎగిసింది.

ముడి చమురు ధరలు మూడేళ్ల గరిష్ఠం వద్ద ఉన్నప్పుడు.. పెట్రోల్​, డీజిల్​ ధరలు కూడా మూడు సంవత్సరాల నాటి స్థాయిల్లోనే ఉండాలి కదా? అనే సందేహం చాలా మందికి కలగొచ్చు.

ధరల్లో ఈ స్థాయి వ్యత్యాసం ఉండేందుకు కారణం లేకపోలేదు. కొవిడ్‌ కారణంగా గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా గిరాకీ తగ్గి చమురు ధర బ్యారెల్​కు 20 డాలర్లకు పడిపోయింది. అయితే ఆ మేర ప్రయోజనాలు మాత్రం వినియోగదారులకు బదిలీ కాలేదు. ఎందుకంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ క్షీణతకు తగ్గట్లు సుంకాలు వడ్డించి.. ఖజానా నింపుకున్నాయి.

కొవిడ్‌ రాకముందు లీటర్​ పెట్రోలుపై రూ.19.98గా ఉన్న ఎక్సైజ్‌ సుంకాన్ని కరోనా కాలంలో రూ.32.98కి, అదే డీజిల్‌పై రూ.15.83గా ఉన్న పన్నును రూ.31.83కు కేంద్రం పెంచింది. ఇక రాష్ట్రాలూ తమ స్థాయికి తగ్గట్లు.. సుంకాలు వడ్డించి ఆదాయం పెంచుకున్నాయి. అయితే పరిస్థితులు కాస్త మెరుగైన తర్వాత.. ముడి చమురు ధరలు పెరుగుతూ పోతున్నా.. తమ ఖజానాకు గండిపడుతుందనే కారణంతో పెంచిన సుంకాల విషయంలో వినియోగదారులకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.

'చమురు సంస్థల ఉదారత'

పెట్రోల్, డీజిల్ రిటైల్​ ధరల పెంపుపై తుది నిర్ణయం చమురు మార్కెటింగ్ సంస్థలదేనని పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్​ కపూర్ ఇటీవల స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మూడేళ్ల గరిష్ఠం వద్ద కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ లెక్క ప్రకారం చూస్తే పెట్రోల్​ డీజిల్​ రేట్లు రిటైల్ ధరలు ఇంకా ఎక్కువగా ఉండాలని.. అయితే వినియోగదారులపై అధిక భారం పడకుండా ధరల విషయంలో చమురు మార్కెటింగ్ సంస్థలు 'ఉదారంగా' వ్యవహరిస్తున్నాయని చెప్పారు.

ఎల్​పీజీ ధరలనే చూస్తే.. నెల రోజుల్లో 665 డాలర్ల నుంచి 797 డాలర్లకు పెరిగిందని.. అయితే ఈ భారాన్ని ఓఎంసీలు వినియోగదారులకు బదిలీ చేయలేదని వివరించారు. వినియోగదారులపై ఈ ప్రభావం స్వల్పంగానే ఉందన్నారు.

సుంకాలు ఎందుకు తగ్గించట్లేదంటే?

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతున్నందున.. ధరల తగ్గుదలకు వస్తున్న డిమాండ్లపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టులో ఓ ప్రకటన చేశారు.

యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు.. రూ.1.44 లక్షల కోట్ల విలువైన ఆయిల్​ బాండ్లను ఇష్యూ చేసి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిందని.. తాము గత ప్రభుత్వంలా గిమ్మిక్కులు చేయాలనుకోవడం లేదని పేర్కొన్నారు సీతారామన్​. అయితే పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రజల ఆందోళన సరైనదేనని మాత్రం ఆమె అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వం కూర్చుని చర్చిస్తే తప్ప ఈ సమస్యకు ఓ పరిష్కారం లభించదన్నారు.

ఆయిల్ బాండ్ల వల్ల ప్రభుత్వంపై భారం అధికంగా ఉందని.. అందుకే తాము పెట్రోల్​, డీజిల్ ధరలను తగ్గించలేకపోతున్నామని వివరణ ఇచ్చారు. చమురుపై ఎక్సైజ్​ డ్యూటీ తగ్గించే యోచన కూడా లేదని స్పష్టం చేశారు సీతారామన్​. యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన ఆయిల్​ బాండ్లకు వడ్డీ చెల్లింపులు ఇంకా మిగిలి ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు.

ఆయిల్ బాండ్లకు.. గత ఐదేళ్లలో రూ.70,195 కోట్లను ప్రభుత్వం వడ్డీ రూపంలో చెల్లించినట్లు చెప్పారు ఆర్థిక మంత్రి. 2026 నాటికి ఇంకా రూ.37 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉందని వెల్లడించారు. వడ్డీ అసలు కలిపి మొత్తం రూ.1.30 లక్షల కోట్ల బకాయిలు ఉన్నట్లు వివరించారు. ఆయిల్ బాండ్ల వడ్డీ భారం లేకుండా ఉంటే.. ఎక్సైజ్ సుంకాలు తగ్గించేందుకు తాము సిద్ధమేనన్నారు.

చమురు ఆదాయం లెక్కలు ఇలా..

పెట్రో ఉత్పత్తులపై ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) ఏప్రిల్‌- జులై మధ్య రూ. లక్ష కోట్లకు పైగా ఎక్సైజ్‌ సుంకం ద్వారా కేంద్రానికి రాబడి వచ్చినట్లు సీజీఏ డేటా ద్వారా వెల్లడైంది. గతేడాది ఇదే నాలుగు నెలల కాలానికి రూ.67,895 కోట్లు సమకూరింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి వసూలైన మొత్తం రూ.32,492 కోట్లు అదనం. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఆయిల్‌ బాండ్లకుగానూ కేంద్రం చెల్లించాల్సింది రూ.10వేల కోట్లు. అంటే ఆయిల్‌ బాండ్లకు చెల్లించాల్సిన మొత్తం కంటే కేవలం నాలుగు నెలల్లో అదనంగా సమకూరిన మొత్తమే మూడు రెట్లు అధికం అన్నమాట!

ఆయిల్‌ బాండ్లకు రూ.1.3 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని నిర్మలా సీతారామన్‌ పేర్కొనగా.. ఆ మొత్తం రూ.1.5 లక్షల కోట్లు అని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి చెప్పడం గమనార్హం.

జీఎస్​టీతోనే ధరలకు కళ్లెం?

దేశంలో ఇతర అన్ని వస్తువుల్లానే పెట్రోలియం ఉత్పత్తులను కూడా వస్తు సేవల పన్ను (జీఎస్​టీ) పరిదిలోకి తీసుకొస్తే.. ధరలు భారీగా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. ఖజానాకు గండి పడుతుందనే కారణంతో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని అంతగా పెట్టించుకోలేదు. అయితే ఎట్టకేలకు గత నెల జరిగిన జీఎస్​టీ మండలి సమావేశంలో ఈ అంశం ప్రాథమికంగా చర్చకు వచ్చింది. అయితే ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జీఎస్​టీ మండలి ప్రకటించింది.

ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపైకి వస్తే.. వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి భారీ ఊరట లభిస్తుందని నిపుణులు అంటున్నారు. పెట్రో ఉత్పత్తులను గరిష్ఠ స్లాబులో చేర్చినా.. రిటైల్ ధరలు మాత్రం కొన్నేళ్ల కనిష్ఠానికి చేరతాయంటున్నారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా? అనేది వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ధరల పెరుగుదల భారాన్ని మోయాల్సిందేనంటున్నారు నిపుణులు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 3, 2021, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.