గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న చమురు ధరల (Fuel price Today) పెంపునకు సోమవారం కాస్త బ్రేక్ పడింది. పెట్రోల్, డీజిల్పై సగటున రోజుకు 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు ప్రకటిస్తూ వచ్చిన చమురు సంస్థలు.. పెంపుపై సోమవారం ఎలాంటి ప్రకటన చేయలేదు.
18 నెలల వ్యవధిలో పెట్రోల్ ధర (Fuel price Today) లీటర్కు రూ.36, డీజిల్పై లీటర్కు రూ.26.58 మేర పెరిగింది.
ప్రస్తుతం దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.59 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ. 96.33 వద్ద కొనసాగుతోంది.
మెట్రో నగరాల్లో ఇలా..
- ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర (Mumbai Diesel Price Today) రూ.113.42కు చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.34 వద్ద కొనసాగుతోంది.
- కోల్కతాలో లీటర్ పెట్రోల్ (Kolkata Today Diesel Price) ధర రూ.108.07గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.99.40 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో లీటర్ పెట్రోల్ (Chennai Diesel Price Today) ధర రూ.104.49 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర రూ.100.55కు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో..
- హైదరాబాద్లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.111.87కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్కు రూ.105.04 కి చేరింది.
- గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్కు రూ.113.89కి చేరింది. డీజిల్పై 35 పైసలు పెరిగి లీటర్ రూ.106.46 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.112.62 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.23కి చేరింది.
ఇదీ చూడండి : 14 ఏళ్ల తర్వాత పెరగనున్న అగ్గిపెట్టె ధర!