పెట్రోల్, డీజిల్ ధరల మోత కొనసాగుతోంది. చమురు ధరలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి. వరుసగా 21వ రోజూ ధరలు పెంచాయి చమురు సంస్థలు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో శనివారం లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు పెరిగింది. డీజిల్ ధర లీటర్‌పై 21 పైసలు ఎగబాకింది.
21 రోజుల్లో పెట్రోల్ ధర లీటర్‌పై సుమారు రూ.9.08, డీజిల్ ధర లీటర్‌పై దాదాపు రూ.10.96 మేర పెరిగింది. వరుస ధరల పెంపుతో దిల్లీలో డీజిల్ ధర సరికొత్త గరిష్ఠానికి చేరింది.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
నగరం | పెట్రోల్ (లీటరుకు రూ.లలో) | డీజిల్ (లీటరుకు రూ.లలో) |
దిల్లీ | 80.38 | 80.40 |
హైదరాబాద్ | 83.41 | 78.55 |
బెంగళూరు | 82.97 | 76.44 |
ముంబయి | 87.12 | 78.69 |
చెన్నై | 83.57 | 77.06 |
కోల్‌కతా | 82.03 | 75.51 |
ఇదీ చూడండి: చమురు ధరలకు రెక్కలెందుకు? ఎవరికెంత వాటా?