దేశంలో పెట్రోల్, డీజిల్‌పై ధరల పెంపు కొనసాగుతోంది. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, లీటర్ డీజిల్‌పై 39 పైసలు పెంచుతూ (Fuel price Today) చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.34కు చేరగా.. డీజిల్ ధర రూ.98.08కు పెరిగింది.
మెట్రో నగరాల్లో ఇలా..
- ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర 34 పైసలు పెరిగి (Mumbai Petrol Price Today) రూ.115.11కు చేరగా.. లీటర్ డీజిల్ 37 పైసలు పెరిగి రూ.106.20 వద్ద కొనసాగుతోంది.
- కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ (Kolkata Petrol Price Today) ధర 33 పైసలు పెరిగి రూ.109.75గా ఉంది. లీటర్ డీజిల్ ధర 35 పైసలు పెరిగి రూ.101.15 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 31 పైసలు పెరిగి (Chennai Petrol Price Today) రూ.106.01 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర 34 పైసలు రూ.102.22కు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో..
- హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.113.68కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్‌కు రూ.106.95 కి చేరింది.
- గుంటూరులో (Guntur Petrol Price) పెట్రోల్ ధర లీటర్‌కు రూ.115.35కి చేరింది. డీజిల్‌పై 37 పైసలు పెరిగి లీటర్ రూ.108.29 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్‌లో (Vizag Petrol Price Today) లీటర్ పెట్రోల్ ధర రూ.115.65 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.108.29కి చేరింది.
ఇదీ చూడండి: ఈపీఎఫ్ఓ వడ్డీరేటుపై ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్