ETV Bharat / business

పెన్షనర్లకు అలర్ట్.. ఇలా చేయకపోతే డబ్బులు రావు!

author img

By

Published : Oct 31, 2021, 2:37 PM IST

మీరు ప్రభుత్వం నుంచి పెన్షన్​ను పొందుతున్నారా? అయితే త్వరపడాల్సిందే. వెంటనే వార్షిక జీవన ధ్రువీకరణ పత్రాన్ని (Pensioners Life Certificate 2021) సమర్పించాలి. లేదంటే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది! మరి ఈ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలో తెలుసా?

PENSIONERS ALERT
PENSIONERS ALERT

పెన్షనర్లకు హై అలర్ట్! పెన్షన్​ను యథావిధిగా పొందాలంటే ప్రతి ప్రభుత్వ పెన్షన్​దారు.. వార్షిక జీవిత ధ్రువీకరణ (లైఫ్ సర్టిఫికేట్) పత్రాన్ని (Pensioners Life Certificate 2021) సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్​లో ఈ సర్టిఫికేట్​ను (Pensioners Life Certificate) సమర్పించకపోతే.. పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది! 80 ఏళ్లు పైబడిన వ్యక్తులు అక్టోబర్ 1 నుంచే లైఫ్ సర్టిఫికేట్లను సమర్పిస్తున్నారు. వీడియో కాల్ ద్వారా కూాడా ఈ సర్టిఫికేట్ సమర్పించే అవకాశం ఉంది.

ఎలా సమర్పించవచ్చంటే..

లైఫ్ సర్టిఫికేట్​ను (Pensioners Life Certificate 2021) సమర్పించేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇలా..

  • పెన్షన్ అందిస్తున్న బ్యాంకు బ్రాంచ్​కి వెళ్లి సమర్పించవచ్చు.
  • జీవన్ ప్రమాణ్ పోర్టల్​లోకి వెళ్లి ఆధార్ ద్వారా డిజిటల్ రూపంలో లైఫ్ సర్టిఫికేట్ (Pensioners Life Certificate online) అందించొచ్చు.
  • బ్యాంకింగ్ డోర్​స్టెప్ ఫెసిలిటీ ద్వారా కూడా సర్టిఫికేట్ (Pensioners Life Certificate form) సమర్పించవచ్చు. దీనికోసం 'డోర్​స్టెప్ బ్యాంకింగ్ యాప్​'లో వివరాలు నమోదు చేసుకొని పెన్షన్ అకౌంట్​ నెంబర్​ను ధ్రువీకరించాలి. కనీస రుసుముతో ఈ పని అయిపోతుంది. బ్యాంకు ప్రతినిధులే మీ ఇంటికి వచ్చి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే ప్రక్రియను పూర్తి చేస్తారు.
  • పోస్ట్​మ్యాన్ ద్వారా ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. ఇందుకోసం పోస్ట్ ఇన్పో మొబైల్ యాప్ లేదా ప్రభుత్వ వెబ్​సైట్​కి వెళ్లి డోర్​స్టెప్ రిక్వెస్ట్ కోసం నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మొబైల్​కు 'ప్రమాణ్ ఐడీ' వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ వెసులుబాటు ఉంది. ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా సరే.. ఈ సేవను వినియోగించుకోవచ్చు. ఇందుకోసం రూ.70 చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్​బీఐ వీడియో కాల్ ఫీచర్

దీంతో పాటు తొలిసారి 'వీడియో లైఫ్ సర్టిఫికేట్​' సేవలను ఎస్​బీఐ ప్రవేశపెట్టింది. నవంబర్ 1 నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దీన్ని ఉపయోగించుకొని ఫించనుదారులు.. తమ లైఫ్ సర్టిఫికేట్లను వీడియో కాల్ చేసి సమర్పించవచ్చు.

ఎలా చేయాలంటే...?

  1. ఎస్​బీఐ పెన్షన్ సేవ పోర్టల్​లోకి వెళ్లి 'వీడియో ఎల్​సీ' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  2. ఎస్​బీఐ పెన్షన్ ఖాతా నెంబర్​ను ఎంటర్ చేసి.. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్​కు వచ్చిన ఓటీపీని వెబ్​సైట్​లో నమోదు చేయాలి.
  3. టర్మ్స్ అండ్ కండిషన్స్​ను యాక్సెప్ట్ చేసి స్టార్ట్ జర్నీ అనే బటన్​పై క్లిక్ చేయాలి.
  4. ఒరిజినల్ పాన్ కార్డును దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత 'ఐయామ్ రెడీ' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  5. ఎస్​బీఐ అధికారులు అందుబాటులోకి రాగానే వీడియో కాల్ ప్రారంభం అవుతుంది.
  6. స్క్రీన్ మీద కనిపించే నాలుగు అంకెల వెరిఫికేషన్ కోడ్​ను అధికారులు అడుగుతారు.
  7. ఆ తర్వాత పాన్​కార్డు ఒరిజినల్​ను చూపించాలి. దాన్ని ఫొటో తీసుకుంటారు.
  8. అనంతరం పెన్షనర్ ఫొటోను తీసుకుంటారు. దీంతో వీడియో లైఫ్ సర్టిఫికేట్ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.
  9. ఒకవేళ ఈ ప్రక్రియ విఫలమైతే.. బ్యాంకు ద్వారా మొబైల్ నెంబర్​కు సందేశం వస్తుంది.

ఇదీ చదవండి: జియోఫోన్ నెక్స్ట్​ ధర ఇలా.. ఈఎంఐ ఆప్షన్​ కూడా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.