డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై ఆరేళ్లయిన నేపథ్యంలో ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. వ్యాపారులు, వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ రూపంలో రివార్డులు అందించేందుకు రూ.50 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. పేటీఎం యాప్ ద్వారా లావాదేవీలు జరిపే ప్రతిఒక్కరికీ ప్రయోజనాలు అందుతాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తం 200 జిల్లాల్లో దీన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల సాధనాలను విస్తృతంగా వినియోగించి డిజిటల్ ఇండియాను విజయవంతం చేయడంలో వ్యాపారులు కీలక పాత్ర పోషించారని సంస్థ పేర్కొంది.
దీపావళి వరకు పేటీఎం యాప్ ద్వారా అత్యధిక లావాదేవీలు జరిపిన వ్యాపారులకు ప్రశంసాపత్రంతో పాటు సౌండ్‌బాక్స్, ఐఓటీ పరికరాల్ని ఉచితంగా ఇవ్వనున్నట్లు పేటీఎం ప్రకటించింది. పేటీఎం బిజినెస్ యాప్ వాడుతున్న వ్యాపారుల్లో ఎంపిక చేసిన వారికి ఆడియో డివైజ్, సౌండ్‌బాక్స్ 50 శాతం రాయితీకి అందజేస్తామని వెల్లడించింది. మరిన్ని ప్రయోజనాలు కూడా అందే అవకాశం ఉందని తెలిపింది. దుకాణాల వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేసే ప్రతి లావాదేవీకి వినియోదారులకు క్యాష్‌బ్యాక్ వస్తుందని పేర్కొంది.
ఇదీ చదవండి:పేటీఎం రూ.22,000 కోట్ల ఐపీఓ!