ETV Bharat / business

భారత్‌లో సర్వీసులు నిలిపేయనున్న పేపాల్‌

author img

By

Published : Feb 5, 2021, 9:55 PM IST

భారత్​లో తమ సేవలను ఏప్రిల్​ 1 నుంచి నిలిపివేయనున్నట్లు డిజిటల్​ చెల్లింపుల సంస్థ పేపాల్​ ప్రకటించింది. ఇకపై భారత్​ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్న సంస్థ.. భారతీయ వ్యాపారాలను అంతర్జాతీయంగా విస్తరించేందుకు కృషి చేస్తామని తెలిపింది.

Paypal to shut domestic payment services within india from apr 1
భారత్‌లో సర్వీసులు నిలిపేయనున్న పేపాల్‌

దేశీయంగా ఏప్రిల్‌ 1 నుంచి తమ సర్వీసులు నిలిపేయనున్నట్లు డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేపాల్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని పేపాల్‌ ప్రతినిధులు శుక్రవారం వెల్లడించారు. "భారత వ్యాపారాల్లో మా పెట్టుబడులు పెట్టనున్నాం. ఇకపై భారతీయ వ్యాపారాలను అంతర్జాతీయంగా విస్తరించేందుకు కృషి చేస్తాం." అని వారు తెలిపారు.

గతేడాదిలో 1.4 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల విలువైన 3.6 లక్షల వ్యాపారాలను పేపాల్‌ నిర్వహించిందని పేపాల్‌ ప్రతినిధులు వెల్లడించారు. వినియోగదారులకు అవసరమైన సేవలను అందిస్తూ భారత్‌ ఆర్థిక వృద్ధిలో పాలుపంచుకుందని తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి భారతీయ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు దృష్టి పెడతామన్నారు. అమెరికాకు చెందిన పేపాల్‌ సంస్థ భారత్‌లో స్విగ్గీ, బుక్‌మై షో వంటి ప్లాట్‌ఫాంలకు చెల్లింపులు చేసేందుకు ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఇది ఈబే అనుబంధ సంస్థగా కొనసాగుతోంది.

ఇదీ చూడండి: '2021-22లో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.