ETV Bharat / business

28 శాతం తరిగిపోయిన ముకేశ్​ అంబానీ ఆస్తులు - 48 మిలియన్ డాలర్లకు పడిపోయిన ముఖేశ్ అంబానీ ఆస్తుల విలువ

రిలయన్స్ అధినేత ముకేశ్​ అంబానీ ఆస్తులు 28 శాతం అంటే రోజుకు 300 మిలియన్​ డాలర్లు చొప్పున క్షీణించాయని 'హురున్ గ్లోబల్ రిచ్​ లిస్ట్' తెలిపింది. కరోనా విజృంభణకు స్టాక్​ మార్కెట్లు భారీ కుదుపునకు లోనవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

Mukesh Ambani's net worth drops 28 pc to USD 48 billion in 2 months
28 శాతం కరిగిపోయిన ముఖేశ్​ అంబానీ ఆస్తులు
author img

By

Published : Apr 6, 2020, 1:46 PM IST

Updated : Apr 6, 2020, 2:19 PM IST

కరోనా వైరస్‌ ధాటికి స్టాక్‌ మార్కెట్లు భారీ కుదుపులకు లోనైన కారణంగా కార్పొరేట్‌ దిగ్గజం ముకేశ్​ అంబానీ ఆస్తులు 28 శాతం తగ్గి 48 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఈ రెండు నెలల్లో ఆయన ఆస్తులు రోజుకు 300 మిలియన్‌ డాలర్లు చొప్పున క్షీణించినట్లు తెలిపింది.

ఎనిమిది స్థానాలు దిగజారి..

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం, ముకేశ్​ అంబానీ సంపద 19 బిలియన్ డాలర్లు క్షీణించింది. ఫలితంగా ప్రపంచ ధనవంతుల జాబితాలో ఆయన ఎనిమిది స్థానాల దిగువకు పడిపోయి 17వ ర్యాంకుకు చేరుకున్నారు.

తరిగిపోతున్న సంపద

గౌతమ్ అదానీ సంపద 37 శాతం తరిగిపోయి 6 బిలియన్ డాలర్లకు చేరగా.... హెచ్​సీఎల్​ టెక్నాలజీస్‌ శివ నాడార్ సంపద 26 శాతం క్షీణించి 5 బిలియన్ డాలర్లకు చేరుకుందని నివేదిక వెల్లడించింది. ఉదయ్ కొటక్ సంపద 28 శాతం పడిపోయి 4 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ ముగ్గురూ టాప్​ 100 ప్రపంచ ధనవంతుల జాబితా నుంచి వైదొలగగా... ముకేశ్​ ఒక్కరే టాప్‌ 100లో కొనసాగుతున్నారు.

కరోనా దెబ్బకు

భారత అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల షేర్లు 26 శాతం పడిపోవడం; డాలర్‌తో రూపాయి మారకం విలువ 5.2 శాతం పడిపోవడమే ఈ క్షీణతకు కారణమని హురున్ రిపోర్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనాస్ రెహ్మాన్ తెలిపారు.

ప్రపంచంలో అత్యధిక సంపద కోల్పోయిన వారిలో ముకేష్ అంబానీ రెండో స్థానంలో నిలవగా.... ఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్ భారీగా నష్టపోయిన వారిలో ప్రథమ స్థానం దక్కించుకున్నారు.

నంబర్​వన్​ బెజోస్​

ప్రస్తుతం 131 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కొనసాగుతున్నారు. ఆయన గత రెండు నెలల్లో 9 శాతం ఆస్తులు మాత్రమే కోల్పోయారు. రెండో స్థానంలో ఉన్న బిల్​ గేట్స్ 14 శాతం సంపదను పోగొట్టుకున్నారు. వారెన్ బఫెట్​ 19 బిలియన్ డాలర్లు నష్టపోయి మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

ఇదీ చూడండి: భారత్​కు పెప్సీ నుంచి 25వేల కరోనా టెస్టింగ్​ కిట్లు

Last Updated : Apr 6, 2020, 2:19 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.