శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)కు ఆధార్ సంఖ్యను అనుసంధానించుకొనేందుకు గడువు తేదీని ప్రభుత్వం మరింత పొడిగించింది. సెప్టెంబరు 30తో ముగియాల్సి ఉన్న ఈ గడువును మరో మూడు నెలలు (డిసెంబర్ 31) పొడిగిస్తూ ఆర్థిక మంత్రిత్వశాఖలోని కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సీబీడీటీ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
గత మార్చిలో ఆధార్-పాన్ అనుసంధానాన్ని ప్రభుత్వం ఆరు నెలలపాటు పొడిగించింది. ఆ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది.
ఇదీ చూడండి:'దివాలా'తో సొంతగూటికి థామస్కుక్ కస్టమర్లు!