కొవాగ్జిన్‌కు సంబంధించిన ఔషధాల తయారీ కాంట్రాక్టు కోసం భారత్ బయోటెక్- జీసీవీసీ(గుజరాత్ కొవిడ్ వ్యాక్సిన్ కన్సార్టియం) మధ్య గురువారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని హెస్టర్ బయోసైన్స్ వెల్లడించింది.
గుజరాత్ కొవిడ్ వ్యాక్సిన్ కన్సార్టియంలో గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ (జీబీఆర్సీ), హెస్టర్ బయోసైన్సెస్, ఓమ్నీ బయోటెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌లు భాగంగా ఉన్నాయి.
ఒప్పందం ప్రకారం ఔషధాల తయారీకి చెందిన సాంకేతికతను భారత్ బయోటెక్.. జీసీవీసీతో పంచుకుంటుంది. ఈ ప్రణాళికను జీబీఆర్సీ పర్యవేక్షిస్తుంది. పని పుర్తి చేయడం కోసం తమ గుజరాత్ ప్లాంటులో అన్ని సదుపాయాలను హెస్టర్ బయోసైన్స్ ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం రూ. 40కోట్లను వెచ్చించనుంది. ఓమ్నిబ్రిక్స్.. సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తుంది.
అన్ని ప్రణాళికాబద్ధంగా జరిగితే ఈ ఆగస్టు నాటికి ఔషధ పదార్థం తయారీ పూర్తి అయ్యి భారత్ బయోటెక్‌కు తిరిగి అందివ్వనుంది హెస్టర్ బయోసైన్సెస్.
ఇదీ చదవండి:అంకురాలకు కరోనా కష్టాలు- వెంటాడుతున్న నిధుల లేమి!