భారతీయ కంపెనీలు ఈ ఏడాది తమ ఉద్యోగులకు సగటున 7.7 శాతం వరకు వేతనాల్లో పెంపు ఇవ్వాలని భావిస్తున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. బ్రిక్స్ దేశాల్లో అత్యధిక వేతన పెంపు ఇవ్వనున్న దేశాల్లో భారత్ ప్రధానంగా ఉండనున్నట్లు పేర్కొంది. 2020లో కంపెనీలు సగటున 6.1 శాతమే వేతనాల పెంపు ఇచ్చినట్లు సర్వే వివరించింది.
గ్లోబల్ ప్రోఫెషనల్ సర్వీస్ సంస్థ 'ఏయాన్' చేసిన ఈ సర్వే వివరాలు మంగళవారం విడుదలయ్యాయి.
సర్వే ముఖ్యాంశాలు..
- సర్వేలో పాల్గొన్న 88 శాతం కంపెనీలు వేతనాల పెంపునకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి. 2020లో 75 శాతం కంపెనీలు మాత్రమే వేతనాల పెంపు ఇచ్చాయి. వ్యాపారాల్లో పెరుగుతున్న సానుకూలతలను ఇది స్పష్టం చేస్తోంది.
- వేతనాలు అత్యధికంగా పెరగొచ్చని అంచనా వేస్తున్న జాబితాలో ఈ-కామర్స్, వెంచర్ క్యాపిటల్, హైటెక్/ ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగాలు ప్రధానంగా ఉన్నాయి.
- వేతనాలు తక్కువగా పెరిగేందుకు అవకాశమున్న జాబితాలో రెస్టారెంట్లు, రియల్టీ/మౌలిక వసతుల కల్పన, ఇంజినీరింగ్ వంటివి ఉన్నాయి. ఈ రంగాల్లో వేతనాల పెంపు సగటున 5-6 శాతం వరకు ఉండొచ్చు.
ఇదీ చదవండి:ఒక్క ట్వీట్‌తో మస్క్ సంపద 15 బిలియన్ డాలర్లు ఉఫ్!