దేశంలో పెట్రో, డీజిల్ ధరల మంట కొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ క్షీణించిన నేపథ్యంలో ఉత్పత్తి తగ్గించాలన్న నిర్ణయంలో మార్పు చేయరాదని చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు ఒపెక్-ప్లస్ నిర్ణయించడమే ఇందుకు కారణం. ఈ మేరకు సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒపెక్ దేశాలు, ఒపెక్‌లో సభ్యత్వం లేని రష్యా నేతృత్వంలోని దేశాల మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు సౌదీ అరేబియా చేస్తున్న చమురు ఉత్పత్తిలో ప్రతి రోజు విధిస్తున్న పది లక్షల బ్యారెళ్ల కోత..ఈ ఏడాది ఏప్రిల్ వరకు అమలులో ఉంటుంది. రష్యా, కజకిస్థాన్ మాత్రం ఉత్పత్తిని స్వల్పంగా పెంచుతాయి.
ఉత్పత్తి పెంచరాదన్న నిర్ణయం కారణంగా చమురు ఉత్పత్తుల ధరలు వెంటనే పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.