ETV Bharat / business

Opec oil output: ఒమిక్రాన్‌ వచ్చినా.. మారని ఒపెక్‌ నిర్ణయం - చమురు ఉత్పత్తిపై ఒమిక్రాన్ ప్రభావం

Opec oil output: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు భవిష్యత్తు గిరాకీపై స్పష్టత లేదు. అయినప్పటికీ.. నెలవారీ చమురు ఉత్పత్తి పెంపును స్థిరంగా, గతంలో అనుకున్నట్లే కొనసాగించాలని ఒపెక్‌, ఒపెక్‌ అనుబంధ దేశాలు నిర్ణయించాయి.

OPEC oil output, omicron effect on oil productin
చమురు ఉత్పత్తిపై ఒమిక్రాన్‌ ప్రభావం
author img

By

Published : Dec 3, 2021, 7:18 AM IST

Opec oil output: నెలవారీ చమురు ఉత్పత్తి పెంపును స్థిరంగా, గతంలో అనుకున్నట్లే కొనసాగించాలని ఒపెక్‌, ఒపెక్‌ అనుబంధ దేశాలు నిర్ణయించాయి. కొవిడ్‌ వైరస్‌ పరిణామాల నుంచి కోలుకుంటున్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆందోళన కలిగిస్తున్నా, భవిష్యత్తు గిరాకీపై స్పష్టత లేకున్నా ఒపెక్‌ నిర్ణయం మారలేదు. సౌదీ అరేబియా ఆధ్వర్యంలోని ఒపెక్‌ దేశాలు, రష్యా ఆధ్వర్యంలోని ఒపెక్‌ అనుబంధ దేశాలు ఇంతకు ముందు నిర్ణయించిన విధంగానే నెలవారీ ఉత్పత్తికి కట్టుబడి ఉండడానికి ఓటేశాయి. అమెరికాతో పాటు చమురును అధికంగా వినియోగించే దేశాలు మాత్రం ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, మరింత అధికంగా చమురు ఉత్పత్తి చేయాలని కోరుతూ వస్తున్నాయి.

Crude oil price: ముడిచమురు ధరల పెంపును అడ్డుకునేందుకు వ్యూహాత్మక నిల్వలను విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పిలుపునివ్వగా, భారత్‌ కూడా ఇందులో భాగమవుతున్న సంగతి విదితమే. వారం కిందట అమెరికా ప్రామాణిక చమురు బ్యారెల్‌ ధర 78 డాలర్లు ఉండగా.. కొవిడ్‌ ఒమిక్రాన్‌ ప్రబలుతోందన్న వార్తలతో గురువారం 67 డాలర్లకు తగ్గింది. మళ్లీ లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తారా, రాకపోకలు, ఆర్థిక కార్యకలాపాలు తగ్గి, చమురుకు గిరాకీ క్షీణిస్తుందా.. అనే అంచనాలే ఇందుకు కారణం. బ్రెంట్‌ చమురు ధర కూడా 79 డాలర్ల నుంచి 70 డాలర్లకు తగ్గింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్‌ వ్యాక్సిన్లు కొత్త వేరియంట్‌పై ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయనే విషయమై స్పష్టత వచ్చాకే, చమురు ఉత్పత్తిపై నిర్ణయం తీసుకుంటామని ఒపెక్‌ అనుబంధ దేశాలు ప్రకటించాయి.

  • 2022 జనవరి నెలకు రోజుకు 4 లక్షల బ్యారెళ్ల ముడిచమురును అదనంగా ఉత్పత్తి చేయాలని ఒపెక్‌, అనుబంధ దేశాలు నిర్ణయించాయి.
  • ఒమ్రికాన్‌ వల్ల లాక్‌డౌన్‌లు మళ్లీ పెట్టాల్సి వస్తే, 2022 ప్రారంభంలో రోజుకు 30 లక్షల బ్యారెళ్ల చమురుకు గిరాకీ తగ్గొచ్చని సంస్థలు అంచనా వేశాయి.

ఇదీ చూడండి: Cement Price Hike: సిమెంట్​ ధరలకు రెక్కలు- ఇకపై బస్తా రూ.400!

ఇదీ చూడండి: రుణం తీసుకోవాలా? ఏ అవసరానికి ఏది​ బెటర్?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.