ETV Bharat / business

1.7 లక్షల ట్విట్టర్‌ ఖాతాల తొలగింపు.. ఎందుకంటే? - 1.7 లక్షల ఖాతాలను తొలగించిన ట్విట్టర్​

చైనా అనుకూల వదంతులు వ్యాప్తి చేస్తున్నారనే కారణంగా సుమారు లక్షా 70 వేల​ ఖాతాలను తొలగించినట్లు ట్విట్టర్​ ప్రకటించింది. కరోనా వైరస్​, హాంకాంగ్​ నిరసనతోపాటు మరికొన్ని అంశాలను.. మోసపూరిత సందేశాలుగా పోస్ట్​ చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ట్విట్టర్​.

1.7 lakhs of Twitter Accounts removed
1.7 లక్షల ఖాతాలను తొలగించిన ట్విట్టర్​
author img

By

Published : Jun 12, 2020, 12:08 PM IST

Updated : Jun 12, 2020, 2:26 PM IST

ఇటీవల దాదాపు లక్షా 70 వేల ఖాతాలను తొలగించినట్లు ట్విట్టర్‌ ప్రకటించింది. చైనా అనుకూల వదంతులను వ్యాప్తి చేస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొవిడ్‌-19, హాంకాంగ్‌ నిరసన సహా మరిన్ని సున్నితమైన అంశాల్లో కొంతమంది మోసపూరిత సందేశాల్ని పోస్ట్‌ చేస్తున్నారని తెలిపింది. ఇవన్నీ 'కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా' విధానాలకు మద్దతుగా ఉన్నట్లు వెల్లడించింది. ట్విట్టర్‌ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ధ్రువీకరించుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విదేశాల్లో ఉన్న చైనీయులపై పార్టీ విధానాల్ని రుద్దడమే లక్ష్యంగా ఈ తప్పుడు సందేశాల్ని వ్యాప్తి చేస్తున్నట్లు 'ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌' తెలిపినట్లు ట్విట్టర్‌ వెల్లడించింది. ఆ సందేశాల్లో అధిక భాగం చైనా భాషలో ఉన్నట్లు గుర్తించామంది.

ఈ ఖాతాలు చాలా వరకు జనవరిలో సృష్టించినవేనని.. నాటి నుంచి కొవిడ్‌-19పై చైనా వాదనను ప్రచారం చేస్తున్నారని 'స్టాన్‌ఫొర్డ్‌ ఇంటర్నెట్‌ అబ్జర్వేటరీ' మేనేజర్‌ రినీ డీరెస్టా తెలిపారు. వీరే అమెరికాపై, హాంకాంగ్‌ నిరసనకారులపై విషం చిమ్మినట్లు కూడా గుర్తించామన్నారు. ఇలా చైనా అనుకూల వాదాన్ని ప్రచారం చేసేందుకు 23,570 కీలక ఖాతాలున్నాయన్నారు. వీటిని తిరిగి మరికొందరు రీట్వీట్‌ చేస్తున్నారన్నారు. అలా మొత్తం 1.7 లక్షల మంది ఖాతాలను గుర్తించి తొలగించామని చెప్పారు.

2019 ఆగస్టులోనూ ఇలాగే హాంకాంగ్‌ అల్లర్లను ప్రోత్సహిస్తున్న 1000 ఖాతాలను గుర్తించి తొలగించారు.

ఇదీ చదవండి: 'మాల్యా అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవద్దు'

Last Updated : Jun 12, 2020, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.