ETV Bharat / business

ఆగస్టు నుంచి భారీగా తగ్గనున్న కార్లు, బైక్​ల ధరలు!

కొత్తగా కార్, బైక్​లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. వచ్చే నెల నుంచి ద్విచక్ర వాహనాలు, కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. పండుగలు కూడా లేని ప్రస్తుత సమయంలో ధరలు తగ్గడం ఏమిటి అనుకుంటున్నారా? మరి అదెందుకో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

On road prices of New Bikes down
కార్లు బైక్​ల ధరలు మరింత్ర చౌక
author img

By

Published : Jul 31, 2020, 2:50 PM IST

కొత్తగా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి ఆగస్టు అనువైన నెలగా మారనుంది. ఎందుకంటే వచ్చే నెల నుంచి ద్విచక్ర వాహనాలు, కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఇప్పటికే విక్రయాలు లేక వాహన రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే.. ఇప్పుడు ధరలు తగ్గడం ఏమిటి? అనేగా మీ సందేహం!

అయితే నిజానికి వాహనాల ధరలు తగ్గేందుకు అసలు కారణం వాహన తయారీ కంపెనీలు కాదు. సమగ్ర బీమా గడువు తగ్గటం. దీనితో ఆన్​రోడ్ ధరలు తగ్గనున్నాయి.

వాహన సమగ్ర బీమాకు సంబధించిన కొత్త నిబంధనలకు బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్​డీఏఐ) ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

కొత్త నిబంధనల్లో ఏముంది?

ఇప్పటివరకు కారు, ద్విచక్ర వాహనం కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిన సమగ్ర పాలసీ గడువు వరుసగా మూడేళ్లు, ఐదేళ్లుగా ఉండేది. ఐఆర్​డీఏఐ కొత్త నిబంధనలతో ఆ గడువు ఏడాదికి తగ్గించింది. దీనితో వాహనం ఆన్​రోడ్​ ధర కూడా భారీగా తగ్గనుంది.

థర్డ్‌ పార్టీ ద్విచక్రవాహనం విషయంలో ఐదేళ్లు, కారు విషయంలో మూడేళ్ల పాలసీ తీసుకోవాలన్న నిబంధనల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని ఐఆర్​డీఏఐ ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:టీవీల దిగుమతులపై కేంద్రం కొత్త ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.