దేశీయ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా ప్రవేశపెట్టిన ఈ-స్కూటర్లకు భారీ స్పందన లభిస్తోంది. 24 గంటల్లో లక్ష బుకింగ్‌లు వచ్చినట్లు ఓలా ఎలక్ట్రిక్ శనివారం వెల్లడించింది.
గురువారం సాయంత్రం నుంచి ఓలా.. బుకింగ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యవహారంపై సంస్థ సీఈఓ హర్షం వ్యక్తం చేశారు.
"దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి వస్తున్న స్పందన పట్ల ఆనందంగా ఉంది. ప్రజలు ఎలక్ట్రానిక్ వెహికిల్స్వైపు మొగ్గు చూపుతున్నారు అనడానికి ఇది నిదర్శనం. వాహన తయారీ రంగంలో కీలక మార్పులు తీసుకురావాలన్న మా లక్ష్యానికి ముందడుగు పడింది."
-భవిష్ అగర్వాల్, ఓలా సీఈఓ.
త్వరలోనే ఓలా ఈ-స్కూటర్ ఫీచర్స్, ధర మొదలైన వివరాలను సంస్థ వెల్లడించనున్నట్లు సమాచారం. ఈ స్కూటర్‌ను తక్కువ ధరకే విక్రయిస్తామని సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. స్కూటర్ వేగం, బూట్‌స్పేస్, రేంజ్ ఉన్నతస్థాయిలో ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది.
'మేడ్ ఇన్ ఇండియా' నుంచి విదేశాలకు ఈ స్కూటర్లు అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ఓలా. ఇందుకు సంబంధించి ఉత్పత్తి కేంద్రాన్ని తమిళనాడులో ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి : రిలయన్స్ చేతికి 'జస్ట్ డయల్'.. 41% వాటా సొంతం!