ETV Bharat / business

ఓలా ఈ-స్కూటర్​ రిలీజ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 181కి.మీ! - Ola electric scooter full updates

మార్కెట్లోకి తొలి విద్యుత్​​ స్కూటర్​ను విడుదల చేసింది ఓలా ఎలక్ట్రిక్​. రెండు వేరియంట్లలో, పది రంగుల్లో ఈ స్కూటర్ లభించనున్నట్లు కంపెనీ తెలిపింది. వీటి ధరలు, ఇతర ఫీచర్లు ఇలా ఉన్నాయి.

Ola electric scooter launched
ఓలా స్కూటర్ విడుదల
author img

By

Published : Aug 15, 2021, 2:46 PM IST

Updated : Aug 15, 2021, 5:43 PM IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఓలా' ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ-స్కూటర్) దేశీయంగా విడుదలైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ-స్కూటర్​ను ఆవిష్కరించింది ఓలా ఎలక్ట్రిక్​. ఎస్​1, ఎస్​1 ప్రో పేర్లతో రెండు వేరియంట్లలో ఈ స్కూటర్​ను అందుబాటులోకి తెచ్చింది. ఎస్​1 ప్రారంభ ధర రూ.99,999గా నిర్ణయించింది. ఎస్​1 ప్రో ప్రారంభ ధర రూ.1,29,999గా ఉంది.

అయితే పలు రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు అందిస్తున్న రాయితీల ద్వారా ఈ ధరల్లో వ్యత్యాసం ఉండనుంది.

ఫేమ్‌ రాయితీ కింద ఎస్​1 ధర.. దిల్లీలో రూ.85,099, గుజరాత్‌లో రూ.79,999, మహారాష్ట్రలో రూ.94,999, రాజస్థాన్‌లో రూ.89,968గా ఉండనుంది.

ఎస్​ 1ప్రో ధరలు.. దిల్లీలో రూ.1,10,149, గుజరాత్​లో రూ.1,09,999, మహారాష్ట్ర రూ.1,19,138, రాజస్థాన్​లో రూ.1,19,138గా ఉండనున్నాయి.

రెండు వేరియంట్లు పది రంగుల్లో లభ్యం కానున్నాయని వెల్లడించింది కంపెనీ.

ఫీచర్లు..

  • ఎస్​1 వేరియంట్​లో 2.98 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది
  • ఎస్​1 ప్రో వేరియంట్​లో 3.97 కిలోవాట్స్​ లిథియం అయాన్ బ్యాటరీని పొందుపరిచింది కంపెనీ
  • ఎస్​1 పూర్తిగా ఛార్జ్​ చేస్తే 121 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది
  • ఎస్​1 ప్రోను పూర్తిగా ఛార్జ్ చేస్తే.. 181 కిలో మీటర్లు ప్రయాణించే వీలుంది
  • రెండు వేరియంట్లకు 750 వాట్స్​ పోర్టబుల్ ఛార్జర్ అందించనుంది ఓలా ఎలక్ట్రిక్​
  • ఎస్​1 పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు నాలుగు గంటల 48 నిమిషాల సమయం పడుతుంది
  • ఎస్​1 ప్రో పూర్తిగా ఛార్జ్​ అయ్యేందుకు ఆరు గంటల 30 నిమిషాల సమయం తీసుకుంటుంది
  • 0-40 కిలోమీటర్ల వేగాన్ని 3 సెకన్లలో అందుకునే సామర్థ్యం
  • 5 సెకన్లలో 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది
  • స్కూటర్​ గరిష్ఠ వేగం గంటకు 115 కిలోమీటర్లు
  • ఈ స్కూటర్లు రివర్స్​లో కూడా ప్రయాణించగలవు.
  • 50 లీటర్ల బూట్‌ స్పేస్‌ను అందిస్తున్నారు
  • నార్మల్‌, స్పోర్ట్‌, హైపర్‌ అనే మూడు డ్రైవింగ్‌ మోడ్‌లు ఉన్నాయి.
  • 3 జీబీ ర్యామ్‌ ఆక్టాకోర్‌ చిప్‌ సెట్‌తో కూడిన ఏడు అంగుళాల తెర.
  • మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా లాక్‌-అన్‌లాక్‌ను ఆపరేట్‌ చేయొచ్చు.
  • స్క్రీన్‌లో ఉండే ‘మూడ్స్‌’ అనే ఫీచర్‌లో పలు రకాల ఒడోమీటర్‌ సెట్టింగ్‌లను పొందొచ్చు.
  • 'బిల్ట్‌ ఇన్‌ స్పీకర్ల'తో ఫోన్‌ కాల్స్‌ కూడా రిసీవ్‌ చేసుకోవచ్చు.

మరిన్ని విశేషాలు..

  • జులై 15న ఓలా సంస్థ.. ఈ-స్కూటర్ బుకింగ్స్​ ప్రారంభించింది.​ రిజిస్ట్రేషన్​ ప్రారంభమైన 24 గంటల్లోనే లక్ష బుకింగ్​లు రావడం విశేషం.
  • అడ్వాన్స్​ బుకింగ్ కోసం వినియోగదారుల నుంచి రూ. 499 వసూలు చేసింది ఓలా.
  • ఆన్​లైన్​ ద్వారా బుక్​ చేసుకున్న వారికి సంస్థ స్కూటర్​లను డోర్​ డెలివరీ ఇవ్వనుంది.
  • 'మేడ్​ ఇన్​ ఇండియా' నుంచి విదేశాలకు ఈ స్కూటర్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఓలా. ఇందుకు సంబంధించి ఉత్పత్తి కేంద్రాన్ని తమిళనాడులోని ఓలా ఫ్యూచర్​ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసింది.
  • మొదటి దశలో భాగంగా ఏడాదికి 20 లక్షల స్కూటర్లను తయారు చేస్తున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. వచ్చే ఏడాదికి ఈ సంఖ్య కోటికి చేరవచ్చని అంచనా.
  • రుణ సదుపాయం కోసం ఓలా ఎలక్ట్రిక్ పదేళ్ల కాలానికి బ్యాంక్​ ఆఫ్​ బరోడాతో ఒప్పందం కుదుర్చుకుంది.
  • ఈ-స్కూటర్ల కోసం దేశవ్యాప్తంగా 400 న‌గ‌రాల్లో లక్ష ఛార్జింగ్ స్టేష‌న్లు ఏర్పాటు చేయనుంది ఓలా. ఛార్జింగ్ స్టేష‌న్లను దూర ప్రాంతాల్లో కాకుండా, షాపింగ్ మాల్స్‌, ఐటీ పార్కులు, ఆఫీస్ కాంప్లెక్స్‌లు, కేఫ్​ల వంటి ప్ర‌దేశాల్లోనే ఏర్పాటు చేయ‌నుంది.
  • ఓలా స్కూటర్​లో ఇన్‌స్టాలేష‌న్ అవ‌స‌రం లేని హోమ్ ఛార్జ‌ర్ కూడా ఉంటుంది. ఈ ఛార్జర్​తో 18 నిమిషాల్లో 50 శాతానికి పైగా ఛార్జ్​​ చేయవచ్చు. తద్వారా 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
  • భారత్​లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ తమ ఈ-స్కూటర్లను విక్రయించనుంది.

ఫ్యాక్టరీ విశేషాలు..

బెంగళూరు నుంచి చెన్నై వైపు 150 కి.మీ దూరంలో తమిళనాడులోని కృష్ణగిరి అనే ప్రాంతంలో దాదాపు 500 ఎకరాల్లో ప్యాక్టరీని నిర్మిస్తోంది ఓలా ఎలక్ట్రిక్. ఇదే భవిష్యత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్తు ద్విచక్రవాహన తయారీ కేంద్రానికి చిరునామా‌ కానుంది. ఇప్పటికే దాదాపు సగానికిపైగా పనులు పూర్తయ్యాయి. 2022, జూన్‌ నాటికి పూర్తి స్థాయిలోకి ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి రానుంది.

ఈ భారీ ప్రాజెక్టుకు రెండు బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది ఓలా ఎలక్ట్రిక్​. మొదటి దశ పనులకే రూ.2,000 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా.

ఇక్కడ ఏడాదికి 20 లక్షల స్కూటర్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కంపెనీ. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యి అందుబాటులోకి వస్తే సంవత్సరానికి కోటి యూనిట్లు ఉత్పత్తి కానున్నాయి. అంటే దాదాపు రెండు సెకన్లకు ఒక యూనిట్‌ను తయారు చేయనుంది.. ఇందుకోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని కంపెనీ నిర్ణయించింది. మొత్తం 10 పూర్తిస్థాయి ప్రొడక్షన్‌ లైన్లను ఏర్పాటు చేయనుంది. 3,000 రోబోలను రంగంలోకి దింపనుంది. ఈ ఫ్యాక్టరీలో 10 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైక్ కొనాలా? ఈ విషయాలు తెలుసుకోండి..

Last Updated : Aug 15, 2021, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.