ప్రవాస భారతీయుల్లో దాదాపు 75శాతం మంది స్థిరాస్తి పెట్టుబడుల కోసం గత ఏడాదిలో దక్షిణాది రాష్ట్రాలనే ఎంచుకున్నారని ఒక సర్వే తేల్చింది. ఇందులో కర్ణాటక (31శాతం), తమిళనాడు (20శాతం), కేరళ (11శాతం), తెలంగాణ (9శాతం) రాష్ట్రాలున్నాయని స్థిరాస్తి వ్యవహారాలను నిర్వహించే క్వికర్ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది. స్థిరాస్తి వ్యాపారంపై అమెరికాలో ఉన్నవారు అధికంగా ఆసక్తి చూపిస్తుండగా, తర్వాత స్థానాల్లో యూఏఈ, బ్రిటన్‌లో నివసిస్తున్న వారున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అధికంగా నిపుణులు విదేశాల్లో స్థిరపడినా, ఈ జాబితాలో ఆ రాష్ట్రానికి చోటు లభించలేదు.
బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో ధరలు తగ్గగా, కొన్నిచోట్ల పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. పుణె, హైదరాబాద్, దిల్లీ, చైన్నెలలోనూ స్థిరాస్తి ధరల్లో కొంత తగ్గుదల కన్పించినట్లు పేర్కొంది. ఇళ్లను అమ్మేందుకు రాయితీలు, ఆఫర్లు ప్రకటించడమే ఇందుకు కారణమని తెలిపింది. ఎన్‌ఆర్‌ఐలలో 29శాతం మంది ప్లాట్ల కొనుగోలుకు మొగ్గు చూపారు. 45శాతం మంది అపార్ట్‌మెంట్/విల్లాల కోసం చూడగా.. ఇందులో 82శాతం మంది సిద్ధంగా ఉన్న ఆస్తుల కొనుగోలుకు ఇష్టపడ్డారని సర్వేలో తేలింది.
ఇదీ చదవండి : 'నెలరోజుల్లో కెనడాకు కొవిషీల్డ్ అందిస్తాం'