ETV Bharat / business

ఇక పేప‌ర్‌లెస్‌గా పాస్‌పోర్ట్ ద‌ర‌ఖాస్తు

సులభంగా పాస్​పోర్ట్​ దరఖాస్తు చేసుకునేందుకు ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది విదేశాంగ మంత్రిత్వశాఖ. దీని ద్వారా పత్రాలు లేకుండా ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుందని ఆ శాఖ తెలిపింది. ఈ మేరకు కావాల్సిన ప‌త్రాల కోసం డిజిలాక‌ర్‌ను అనుమ‌తించినట్లు వెల్లడించింది.

Now apply for passport services through Digi Locker
ఇక పేప‌ర్‌లెస్‌గా పాస్‌పోర్ట్ ద‌ర‌ఖాస్తు
author img

By

Published : Feb 20, 2021, 8:08 PM IST

విదేశాంగ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా పాస్‌పోర్ట్ కోసం ఎక్క‌డైనా దరఖాస్తు చేసుకునేందుకు అవ‌స‌ర‌మైన ప‌త్రాల కోసం డిజిలాక‌ర్‌ను అనుమ‌తించింది. డిజిలాక‌ర్‌లో ఉన్న డాక్యుమెంట్ల‌ను ధ్రువీక‌ర‌ణ కోసం ఉప‌యోగించ‌వ‌చ్చు.

డిజిలాక‌ర్ పత్రాలకు లింక్..

ఈ కొత్త సదుపాయంతో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు డిజిలాకర్ ద్వారా అవసరమైన వివిధ పత్రాలను కాగిత‌ర‌హిత విధానంలో సమర్పించగలుగుతారు. అప్పుడు ఒరిజిన‌ల్ డాక్యుమెంట్ల‌ను తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎమ్ఈఏ) తెలిపింది. డిజిటల్ ఇండియా ల‌క్ష్యంలో భాగంగా డిజిలాక‌ర్ ఒక‌ కీలకమైన చొరవ. ఇది ఎక్క‌డైనా అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్ల‌ను డిజిట‌ల్ రూపంలో అందించి మీ వివ‌రాల‌ను ధ్రువీక‌రించేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.

కాగిత ర‌హిత విధానం‌..

డిజిట‌ల్ ఇండియాలో భాగంగా డిజిలాకర్ అనేది డిజిటల్ రూపంలో డాక్యుమెంట్లు/ ధ్రువీకరణ పత్రాలను జారీ చేయడానికి, ధ్రువీకరించడానికి మంచి ప్లాట్‌ఫామ్‌. ఇది భౌతికంగా పత్రాల వాడకాన్ని తొలగిస్తుంది. అంతేకాకుండా, పాస్‌పోర్ట్‌లు కూడా డిజిలాకర్‌లో అప్‌లోడ్ చేస్తే, వినియోగదారులకు అధికారికంగా అవ‌స‌ర‌మైన వివ‌రాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఒక‌వేళ‌ పాస్‌పోర్ట్ పోతే ఇది చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. గత 6 సంవత్సరాల్లో పాస్‌పోర్ట్ సంబంధిత సేవల్లో చాలా మెరుగుదల ఉందని ఎంఈఏ తెలిపింది.

త్వ‌ర‌లో ఇ-పాస్‌పోర్ట్..

పౌరుల కోసం ఇ-పాస్‌పోర్ట్‌ను రూపొందించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఇది భద్రతను పెంచుతుంది. విదేశీ విమానాశ్రయాలలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియల సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. రాబోయే పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ వి2.0 లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల ఉపయోగం, చాట్-బోట్, అనలిటిక్స్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్‌పీఏ) మొదలైనవి పాస్‌పోర్ట్ సేవ‌ల‌ను సులభతరం చేయడానికి, వేగవంతమైన సేవల‌కు సహాయపడతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇదీ చూడండి: 'ధరలు తగ్గించాలని తప్ప మరేం చెప్పలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.