ETV Bharat / business

'రాష్ట్రాలు కలిసొస్తే జీఎస్​టీ పరిధిలోకి పెట్రోల్!'

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్​టీ పరిధిలోకి తీసుకురావడంపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి మరోసారి కీలక విషయాలు వెల్లడించారు. రాష్ట్రాలు ముందుకు వస్తే.. జీఎస్​టీ మండలిలో ఈ అంశాన్ని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఇంత వరకు ఏ ఒక్క రాష్ట్రం కూడా ఈ అంశంపై ప్రతిపాదనలు చేయలేదని స్పష్టం చేశారు.

GST on petroleum products
పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్​టీ
author img

By

Published : Mar 15, 2021, 2:45 PM IST

పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జీఎస్​టీ) పరిధిలోకి తీసుకురావాలని ఇంత వరకు ఏ రాష్ట్రం నుంచి కూడా ప్రతిపాదన రాలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్​ తెలిపారు. లోక్​ సభ ప్రశ్నోత్తరాల సమయంలో జేడీ(యూ) ఎంపీ రాజీవ్ రాజన్ సింగ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు​.

'వివిధ రాష్ట్రాల సూచనల ఆధారంగా జీఎస్​టీ మండలి అజెండా సమావేశం నిర్వహిస్తారు. అయితే ఇంత వరకు ఏ ఒక్క రాష్ట్రం కూడా ఈ అంశాన్ని (పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్​టీ విధింపు) సూచించలేదు.' అని ఠాకూర్​ వివరించారు. తదుపరి జీఎస్​టీ మండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.

నిజానికి పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్​టీ విధింపు అంశం దీర్ఘకాలంగా పెండింగ్​లో ఉంది. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ అంశం మళ్లీ చర్చల్లో నిలిచింది.

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు కేంద్రం, రాష్ట్రాలు రెండూ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందన్నారు అనురాగ్​ ఠాకూర్​. రాష్ట్రాలు పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు తగ్గిస్తే.. తాము (కేంద్రం) కూడా సుంకాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.