అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. చమురు ధరల పెరుగుదలపై ఆందోళన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందన్నారు.
అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చినా అది తాత్కాలికమేనన్నారు కేంద్ర మంత్రి. ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల ప్రభావం చమురు సరఫరాదారులపై పడే అవకాశం ఉందని భావించినా పరిస్థితులు సద్దుమణగడంతో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని తెలిపారు.
ఇదీ చూడండి:రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం.. 8 మంది దుర్మరణం