దేశవ్యాప్తంగా ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కీలక ప్రకటన చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని తెలిపింది. వినియోగదారులకు ఇంధన సరఫరాపై ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చింది.
దేశంలో ఏప్రిల్ మొత్తానికి సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నట్లు స్పష్టం చేశారు ఐఓసీ ఛైర్మన్ సంజీవ్ సింగ్. వంటగ్యాస్‌కూ ఎలాంటి కొరత లేదని.. బాటిలింగ్ ప్లాంట్లు 130 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపారు.