కిచెన్‌లో వంటగ్యాస్ సిలిండర్‌కు సరికొత్త రూపునిచ్చింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. రంగుల కలయికతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఈ ఆధునిక కాంపోజిట్ ఎల్పీజీ సిలిండర్‌ను తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని సంస్థ ఛైర్మన్ ఎస్ఎం వైద్య సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. చూడచక్కని డిజైన్లో ఉన్న కొత్త సిలిండర్‌తో ఇంట్లో కిచెన్ కళకళలాడుతుందని పేర్కొన్నారు.
కొత్త సిలిండర్ ఫీచర్స్:
- సాధారణ సిలిండర్కన్నా 50% తక్కువ బరువు
- ఆకర్షణీయమైన రూపం- పారదర్శకమైన బాడీ
- గ్యాస్ ఇంకా ఎంత ఉందో నేరుగా చూసి తెలుసుకునే వీలు
- మిశ్రమ పదార్థాలతో తయారు చేసినందున తుప్పు పట్టని సిలిండర్
- 5, 10 కిలోల సామర్థ్యం
ప్రస్తుతానికి ఈ సిలిండర్లను దిల్లీ, హైదరాబాద్‌లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఓసీ. రానున్న రోజుల్లో ఇతర నగరాల్లోనూ లభ్యమయ్యేలా చూస్తామని తెలిపింది.