ETV Bharat / business

మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో కొత్త కార్లు.. భలే బైక్‌లు! - కొత్త బైకులు

పండగ సీజన్​ కావడం వల్ల కొత్త కార్లు, బైకులు మార్కెట్లోకి విడుదల చేశాయి కార్లు, బైకుల తయారీ సంస్థలు. సరికొత్త ఫీచర్లతో విడుదలైన ఆ వాహనాలు ఏవో ఓసారి పరిశీలించండి!

new bikes and cars information
కార్లు, బైకులు ఫీచర్లు
author img

By

Published : Oct 16, 2021, 12:48 PM IST

మార్కెట్‌లోకి సరికొత్త ఫీచర్లతో కొత్త కార్లు, బైక్లు వచ్చాయి. పండగ రోజులు కదా కొత్త వాహనం ఇంటికి తీసుకెళ్దామనుకుంటే వీటిపై ఓ లుక్కేయండి మరి!

కియా ఇండియా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సోనెట్‌ మోడల్‌లో మొదటి వార్షికోత్సవ ఎడిషన్‌ను విడుదల చేసింది. నాలుగు పవర్‌ట్రైన్‌ సదుపాయాల్లో, మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌లతో ఈ వాహనం లభించనుంది. పెట్రోల్‌ వెర్షన్‌లు రూ.10.79 లక్షలు, రూ.11.49 లక్షలతో, డీజిల్‌ వేరియంట్‌లు రూ.11.09 లక్షలు, రూ.11.89 లక్షల ధరలతో లభిస్తాయి.

new cars
కియా ఇండియా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సోనెట్‌ మోడల్‌

బీఎండబ్ల్యూ కొత్త 3 సిరీస్‌ గ్రాన్‌ లిమోసిన్‌ 'దిగ్గజ ఎడిషన్‌'ను విపణిలోకి తీసుకొచ్చింది. బీఎండబ్ల్యూ చెన్నై ప్లాంట్‌లో ఈ మోడల్‌ను ఉత్పత్తి చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ విక్రయశాలల్లో పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లలో లభించనుంది. పెట్రోల్‌ వెర్షన్‌ ధర రూ.53.5 లక్షలు కాగా.. డీజిల్‌ వేరియంట్‌ ధర రూ.54.9 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).

new cars
బీఎండబ్ల్యూ కొత్త 3 సిరీస్‌ గ్రాన్‌ లిమోసిన్‌

టాటా మోటార్స్‌ సబ్‌ కాంప్యాక్ట్‌ స్పోర్ట్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) 'పంచ్‌'కు భద్రత విషయంలో 5 స్టార్‌ అడల్ట్‌ రేటింగ్‌ లభించింది. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌(జీఎన్‌కాప్‌) నిర్వహించిన క్రాష్‌ టెస్ట్‌లో ఈ రేటింగ్‌ వచ్చింది. ఈనెల 18న ఈ వాహనాన్ని సంస్థ ఆవిష్కరించనుంది.

new cars
పంచ్‌

హీరో మోటోకార్ప్‌ కొత్త మోటార్‌సైకిల్‌ ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్‌ స్టెల్త్‌ ఎడిషన్‌ను విపణిలో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.1.67 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ). ఎల్‌ఈడీ వింకర్లు, సైడ్‌ స్టాండ్‌ ఇంజిన్‌ కటాఫ్‌, సమీకృత యూఎస్‌బీ ఛార్జర్‌, ఎల్‌సీడీ బ్రైట్‌నెస్‌ అడ్జస్ట్‌మెంట్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్పీడ్‌మీటర్‌ మీద కొత్తగా గేర్‌ ఇండికేటర్‌ సదుపాయాన్ని కల్పించినట్లు కంపెనీ తెలిపింది.

new bikes
ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్‌ స్టెల్త్‌ ఎడిషన్‌ బైక్​

ఆంపియర్‌ ఎలక్ట్రిక్‌ మాగ్నస్‌ విద్యుత్‌ స్కూటర్ల శ్రేణిని విస్తరించింది. మరిన్ని కొత్త ఫీచర్లతో మాగ్నస్‌ ఈఎక్స్‌ మోడల్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ.68,999 (ఎక్స్‌-షోరూమ్‌ పుణె)గా నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలతో ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఒకసారి ఛార్జింగ్‌తో 121 కి.మీ ప్రయాణం చేయొచ్చని వెల్లడించింది.

new bikes
మాగ్నస్‌ ఈఎక్స్‌

ఇదీ చూడండి: Petrol Prices: వరుసగా మూడోరోజూ పెరిగిన ఇంధన ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.