ETV Bharat / business

ఇక వాహనాలకూ నామినీ సౌకర్యం - వాహనాల నామినీ ప్రక్రియ

వాహనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. బ్యాంకు ఖాతాలు, బీమాల తరహాలో వాహనాలకు కూడా నామినీ సౌకర్యాన్ని కల్పించేలా.. కొత్త నిబంధలను తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఆహ్వానం పంపింది రవాణా శాఖ. ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే?

National Road and Transport Department proposal to provide nominee facility for vehicles
ఇక వాహనాలకూ నామినీ సౌకర్యం
author img

By

Published : Nov 28, 2020, 6:54 AM IST

కేంద్ర రహదారి, రవాణాశాఖ వాహనాల విషయంలో శుక్రవారం ఒకే రోజు మూడు సంస్కరణలను ప్రతిపాదించింది. ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు, బీమాలకు ఉన్న నామినీ సౌకర్యాన్ని ఇప్పుడు వాహనాలకూ వర్తింపజేస్తూ కొత్త నిబంధనకు శ్రీకారం చుట్టింది. పురాతనమైన వింటేజ్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌కు నూతన నిబంధనలను తెర మీదకు తెచ్చింది. ఓలా, ఉబెర్‌లాంటి క్యాబ్‌ అగ్రిగేటర్లను నియంత్రించడానికి కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఈ మూడింటి ముసాయిదాలపై ప్రజాభిప్రాయాలను ఆహ్వానించింది.

1. సులువుగా వాహనాల హక్కుల బదిలీ

వాహన యజమాని చనిపోతే దాని హక్కులు ఆటోమేటిక్‌గా నామినీకి వెళ్లే సౌకర్యం ఇప్పటి వరకూ లేదు. వాహన యాజమాన్య హక్కుల బదిలీ ప్రక్రియ వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉండటంవల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని తొలగించడానికి సెంట్రల్‌ మోటార్‌ వెహికిల్‌ రూల్స్‌-1989లో మార్పులు ప్రతిపాదించారు.

  • వాహన రిజిస్ట్రేషన్‌ సమయంలోనే యజమాని తన నామినీని ప్రతిపాదిస్తే వారి తదనంతరం వాహనం సంబంధిత వ్యక్తి పేరుపైకి బదిలీ చేస్తారు.
  • ఒకవేళ యజమాని చనిపోతే వారి మరణ ధ్రువపత్రాన్ని రిజిస్టరింగ్‌ అథారిటీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసి వాహన హక్కులను తన పేరు మీద బదలాయించాలనినామినీ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఆధార్‌ ధ్రువీకరణ సౌకర్యాన్ని ఎంచుకుంటే రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేకుండానే యాజమాన్య హక్కులు బదిలీ అవుతాయి.
  • విడాకులు, ఆస్తుల విభజన, ఆస్తుల బదిలీలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నామినీ పేర్లను మార్చడానికీ వెసులుబాటు ఉంది.

2. పురాతన వాహనాల వారసత్వం కాపాడడం ఇలా...

పురాతన వాహనాల వారసత్వాన్ని కాపాడటానికి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ‘వింటేజ్‌ వాహనాలు’గా పిలిచే వీటి రిజిస్ట్రేషన్‌ను సరళీకరించనుంది.

  • తొలుత రిజిష్టర్‌ అయిన దగ్గరి నుంచి 50 ఏళ్లు గడిచిన వాణిజ్యేతర, వ్యక్తిగత వాహనాలను మాత్రమే వింటేజ్‌ మోటార్‌ వాహనాలుగా పిలుస్తారు. ద్వి చక్ర, నాలుగు చక్రాల వాహనాలు వీటి పరిధిలోకి వస్తాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వాహనాలకూ ఈ నిర్వచనం వర్తిస్తుంది.
  • వీటి రిజిస్ట్రేషన్‌కు పరివాహన్‌ పోర్టల్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • ఒకసారి వింటేజ్‌ మోటార్‌ వెహికిల్‌ కింద రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే దాని క్రయ, విక్రయాలన్నీ ఆ నిబంధనల ప్రకారమే జరుగుతాయి.

3. అగ్రిగేటర్ల కమీషన్‌ 20 శాతమే

  • ఓలా, ఉబెర్‌లాంటి సంస్థలు కమీషన్‌ రూపంలో ‘బేస్‌ ఫేర్‌’ (పన్నులు, ఇతరత్రా ఫీజులు కలపని ప్రాథమిక ఛార్జీ)లో 20%కి మించి వసూలు చేయడానికి వీల్లేదు.
  • ట్రిప్‌ ఛార్జీలు కూడా బేస్‌ ఫేర్‌పై 1.5 రెట్లకు మించి పెంచకూడదు.
  • అగ్రిగేటర్లతో అనుసంధానమై క్యాబ్‌లు నడిపే డ్రైవర్లకు ప్రతి ట్రిప్‌నకు వసూలు చేసే ఛార్జీలో 80% దక్కాలి. మిగిలింది అగ్రిగేటర్‌ తీసుకోవచ్చు.
  • బేస్‌ ఫేర్‌లో 50%కి మించి డిస్కౌంట్లు కూడా ఇవ్వకూడదు.
  • అగ్రిగేటర్లు 24×7 కంట్రోల్‌ రూం నిర్వహించాలి.

ఇదీ చదవండి: 'వైరస్‌లను నిరోధించే రంగులకు గిరాకీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.