ETV Bharat / business

భారత రోడ్లపై త్వరలోనే విద్యుత్​ కార్ల జోరు! - విద్యుత్ కార్లపై భారత వినియోగదారుల అభిప్రాయాలు

భారత్​లో ఇతర దేశాల సగటుకన్నా.. రెండేళ్ల ముందే (2022 నాటికి) విద్యుత్​ కార్లను కొనుగులు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. క్యాస్ట్రాల్ చేసిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

Indians opinion on EV
విద్యుత్ వాహనాలపై భారతీయుల అభిప్రాయాలు
author img

By

Published : Sep 3, 2020, 6:03 PM IST

భారత్​లో ఎక్కువ మంది వాహనదారులు 2022 నాటికి విద్యుత్ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. అయితే 2025 నాటికి కొత్తగా కొనే కార్లలో విద్యుత్​తో నడిచేవే ఎక్కుగా ఉంటాయని వారు భావిస్తున్నట్లు లూబ్రికెంట్స్ సంస్థ క్యాస్ట్రాల్​ నిర్వహించిన సర్వే ద్వారా వెల్లడైంది.

ఈ సర్వే ప్రకారం సగటున రూ.23 లక్షల ధర, 35 నిమిషాల ఛార్జింగ్ సమయం, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 401 కిలో మీటర్ల ప్రయాణించే సదుపాయాలు ఉంటే.. విద్యుత్ వాహనాల కొనుగోలుకు భారతీయ వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపుతారని తెలిసింది.

ఇతర దేశాల వినియోగదారుల విషయంలో మాత్రం విద్యుత్ వాహనాల ధర సగటు రూ.27 లక్షలుగా ఉన్నట్లు సర్వే తెలిపింది.

సర్వే వివరాలు..

ప్రపంచవ్యాప్తంగా 10,000 మందిపై ఈ సర్వే చేసింది క్యాస్ట్రాల్. అందులో భారత్​లో వినియోగదారులు, ఫ్లీట్​ మేనేజర్లు, పరిశ్రమ నిపుణులు కలిపి మొత్తం 1,000 మంది నుంచి అభిప్రాయాలు తీసుకుని నివేదిక రూపొందించింది.

ఈ నివేదిక ప్రకారం సగటున 2022 నాటికి విద్యుత్ వాహనాల కొనుగోలును పరిశీలిస్తామని చెప్పారు. ఇది ప్రపంచ సగటు అయిన 2024తో పోలిస్తే రెండేళ్లు ముందే కావడం గమనార్హం.

విద్యుత్ కార్ల నిర్వహణపై ఉన్న అపోహలు.. వాటిని కొనకుండా 83 శాతం భారత వినియోగదారులను అడ్డుకుంటున్నాయని సర్వే తెలిపింది.

వేగంగా ఛార్జింగ్ చేసే సదుపాయం అందుబాటులోకి వస్తే.. విద్యుత్ కార్లను ఎక్కువగా కొంటారని 72 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:జీడీపీ క్షీణత భారత్​లోనే అత్యధికం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.