ETV Bharat / business

'జన్​ధన్ ఖాతాల్లో 55% మహిళలవే' - ముద్ర యోజన లబ్ధిదారుల్లో అత్యధికులు మహిళలే

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర పథకాల్లో అతివలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలిపేందుకు ఆర్థిక శాఖ కీలక గణాంకాలు వెల్లడించింది. జన్​ధన్​​ బ్యాంక్ ఖాతాల్లో 55 శాతం మహిళలవేనని తెలిపింది. ముద్ర రుణాలు పొందిన వారిలో 68 శాతం మంది ఔత్సాహికులూ మహిళలేనని పేర్కొంది.

Women make up the majority of Jan Dan accounts
జన్​ ధన్ ఖాతాల్లో మహిళలే అధికం
author img

By

Published : Mar 8, 2021, 5:38 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధాన్ మంత్రి జన్​ధన్​ పథకం కింద బ్యాంక్ ఖాతాలు తీసుకున్న వారిలో సగానికి పైగా మహిళలే ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నాటికి మొత్తం 41.93 జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు ఉంటే.. అందులో 55 శాతం (23.21 కోట్ల ఖాతాలు) మహిళలవేనని పేర్కొంది.

చిన్న సంస్థలకు రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రధాన్​ మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) లబ్ధిదారుల్లోనూ అత్యధికంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. 19.04 కోట్ల ఖాతాలకు (68 శాతం మహిళలకు) ఈ ఏడాది ఫిబ్రవరి 26 నాటికి రూ.6.36 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వివరించింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాల్లో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలిపేందుకు ఆర్థిక శాఖ ఈ వివరాలు వెల్లడించింది.

ఇదీ చదవండి:కుటుంబ ఆర్థిక భద్రతకు మహిళా భరోసా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.