ETV Bharat / business

'పేజరో' ఎస్​యూవీకి మిత్సుబిషి గుడ్ బై

కరోనా కారణంగా వాహన రంగం తీవ్రంగా కుదేలైన వేళ.. వాహన తయారీ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నాయి. తాజాగా.. అమ్మకాలు పడిపోయినందున జపాన్​కు చెందిన 'మిత్సుబిషి మోటార్స్'.. 'పేజరో ఎస్​యూవీ' ఉత్పత్తిని నిలిపేయనున్నట్లు ప్రకటించింది.

mitsubishi to stop Pajaro Producing
పేజరో మోడల్​కు గుడ్​బై
author img

By

Published : Jul 28, 2020, 1:08 PM IST

ఎస్​యూవీ వాహన విభాగంలో ఎన్నో రికార్డులు, ఎంతో మంది ఫేవరెట్​గా నిలిచిన 'పేజరో' మోడల్​కు గుడ్​ బై చెప్పనుంది జపాన్​కు చెందిన 'మిత్సుబిషి మోటార్స్'. కరోనా ప్రభావం, కంపెనీ వరుసగా రెండవ సంవత్సరం కూడా భారీ నష్టాలు చవిచూడాల్సి రావటం వల్ల తాము ఈ నిర్ణయానికి వచ్చినట్టు సంస్థ ప్రకటించింది. 2021 నుంచి ఫేజరో ఉత్పత్తి నిలిపివేయనున్నట్లు తెలిపింది.

గిన్నిస్ రికార్డు..

స్పోర్ట్స్‌ కార్ల విభాగంలో పేజరో అంతర్జాతీయంగా పేరు గడించింది. అత్యంత కఠినమైనదిగా భావించే డాకర్‌ ర్యాలీలో కార్ల విభాగంలో 2001 నుంచి 2005 వరకూ ఈ వాహనం వరుస విజయాలను సాధించింది. గిన్నిస్‌ రికార్డులకెక్కిన ఈ ఘనతను ఇప్పటికీ ఎవరూ సమం కూడా చేయలేకపోవటం గమనార్హం.

రికార్డు స్థాయి పతనం..

కొవిడ్‌-19 ప్రభావంతో ఈ వాహన అమ్మకాలు అడుగంటాయి. ఇదిలా ఉండగా.. మంగళవారం నాటికి కనీవినీ ఎరుగని విధంగా మిత్సుబిషి షేర్ల విలువ 10 శాతం కన్నా ఎక్కువగా పడిపోయింది. మరోవైపు మార్చి 2021 నాటికి సంస్థ సుమారు 1.33 బిలియన్‌ డాలర్ల నష్టం చవిచూడాల్సి రావచ్చనే అంచనాలు వెలువడ్డాయి. 1982లో లిస్టింగ్‌ తర్వాత మిత్సుబిషి ఈ స్థాయిలో నష్టాన్ని చవిచూడాల్సి రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో సంస్థను నిలబెట్టేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా మిత్సుబిషి.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పేజరో ఎస్‌యువీ ఉత్పత్తిని నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఫలితంగా జపాన్‌లో ఉన్న సంబంధిత కర్మాగారం కూడా మూతపడనుంది. అంతేకాకుండా, యూరోప్‌, ఉత్తర అమెరికాల్లో కూడా తన కార్యకలాపాలను తగ్గించుకుని... ఆసియాపై దృష్టి కేంద్రీకరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సంస్థ ప్రకటించింది.

ఇదీ చూడండి:గూగుల్​ ఉద్యోగులకు 2021 జూన్ వరకు వర్క్​ ఫ్రం హోమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.