ETV Bharat / business

KTR on French Investment: ఇతర రాష్ట్రాలకు మించి ప్రోత్సాహకాలు అందిస్తాం: కేటీఆర్

రాష్ట్రంలో ఫ్రెంచ్‌ సంస్థల పెట్టుబడులకు విస్తృత ప్రోత్సహకాలు అందిస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఇతర రాష్ట్రాల ప్రతిపాదనలకు సమానంగా లేదా అంతకు మించి ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలులో ఉన్న విధానాలు పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉన్నాయని ఫ్రాన్స్‌ ప్రతినిధులు ప్రశంసించారు.

author img

By

Published : Oct 9, 2021, 5:10 AM IST

Updated : Oct 9, 2021, 5:47 AM IST

KTR  on French Investment
ఫ్రెంచ్‌ సంస్థల పెట్టుబడులకు విస్తృత ప్రోత్సహకాలు

హైదరాబాద్‌ హెచ్​ఐసీసీలో ది ఇండో-ఫ్రెంచ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ- ఐఎఫ్​సీసీఐ ఆధ్వర్యంలో పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభమైంది. తెలంగాణలో ఫ్రెంచ్‌ కంపెనీల పెట్టుబడుల విస్తరణ పేరిట ఈ సదస్సు జరిగింది. ఫ్రెంచ్ రాయబారి ఇమాన్యుయెల్ సహా వంద మంది పారిశ్రామిక వాణిజ్య సంస్థల అధిపతులు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఫ్రెంచ్‌ కంపెనీలకు పెద్దపీటవేస్తామని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ వంటి రంగాల్లో రాష్ట్రంలో అపార అవకాశాలున్నట్లు వివరించారు. ఇప్పటికే సనోఫీ, కియోలిస్‌, సెయింట్ గోబెన్‌ వంటి ఫ్రెంచ్‌ సంస్థలు రాణిస్తున్నాయని గుర్తుచేశారు. ఫ్రెంచ్‌ పెట్టుబడులకు ఇతర రాష్ట్రాల అందించే ప్రోత్సాహకాలకు మించి తాము సహకరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

విదేశీ పెట్టుబడులకు సంబంధించి విధాన రూపకల్పన కేంద్రం చేతుల్లో ఉంటుంది. కానీ ఆ తర్వాత సంస్థలకు కావాల్సినవన్నీ.. భూమి, నీరు, మానవ వనరులు, ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది. సులభతర వాణిజ్యంలో దేశంలోనే తెలంగాణ తొలి మూడు స్థానాల్లో స్థిరంగా నిలుస్తోంది. మా విధానాలు పెట్టుబడులను ఆకర్షించడమే గాక సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రానికి పోటీగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు ఏం ప్రోత్సాహకాలు అందిస్తున్నాయో మీరు వివరిస్తే మేం వారికి సమానంగా లేదా అంతకుమించి సహకారం అందిస్తాం.

పెట్టుబడిదారుల సదస్సులో మంత్రి కేటీఆర్

ప్రభుత్వ అత్యుత్తమ విధానాలతో ఇప్పటికే 89 దేశాల కంపెనీలను రాష్ట్రానికి ఆకర్షించామని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి సంస్థ లాభాల బాటలో సాగుతుండటం గర్వకారణమన్నారు. టీఎస్​ ఐపాస్‌ వంటి పాలసీలతో వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగాలు కల్పించామన్నారు.

దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత ఆర్థిక రంగానికి దన్నుగా నిలుస్తున్న నాలుగో అతిపెద్ద రాష్ట్రం. ఏడేళ్లలో 17వేల302 కంపెనీలకు అనుమతులిచ్చాం. 2లక్షల 40వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించాం. ప్రైవేటు రంగంలో ప్రత్యక్షంగా 16లక్షలు, పరోక్షంగా అంతకు రెండింతల ఉద్యోగాలు కల్పించాం. -కేటీ రామారావు, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి

సదస్సులో పాల్గొన్న ఫ్రెంచ్‌ రాయబారి ఇమ్మాన్యూయేల్‌ ఈ వేదిక ద్వారా తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను ఫ్రెంచ్ కంపెనీలు తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా తమవంతు సహకారం అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు చాలా గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు.

నేను ఏదైనా రాష్ట్రానికి వెళ్లినపుడు అక్కడ వివిధ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల జాబితా తీసుకుంటాను. వివాదాలు, ప్రభుత్వం నుంచి భూములు, ప్రోత్సాహకాలు అందించకపోవడం వంటి సమస్యలుంటే వ్యాపారం అభివృద్ధి సాధించదు. తెలంగాణలో నా జాబితాలోని సమస్యల సంఖ్య శూన్యం. ఇదొక గొప్ప విషయం. రాష్ట్రంలో పెట్టుబడుల్లో మరింత ముందుకు వెళ్తామనే ధీమా ఉంది. సదస్సు వేదికగా రాష్ట్రంలో ఫ్రెంచ్ కంపెనీల పెట్టుబడులకు సంబంధించి పలు ఒప్పందాలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: KTR: 'పెట్టుబడులు పెట్టేవారికి అత్యున్నత ప్రోత్సాహకాలిస్తాం'

Last Updated : Oct 9, 2021, 5:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.