ETV Bharat / business

చైనాలో సిగ్నల్ యాప్​పై నిషేధం!

సిగ్నల్ యాప్​ను చైనా నిషేధించినట్లు తెలుస్తోంది. వీపీఎన్ లేకుండా ఈ యాప్​ను యాక్సెస్ చేయడం కష్టంగా మారింది. ఫేస్​బుక్, ట్విట్టర్ వంటి అంతర్జాతీయ సామాజిక మాధ్యమాల మాదిరిగానే దీనిపైనా ఆంక్షలు విధించినట్లు స్పష్టమవుతోంది.

messaging app signal appears have been blocked china
చైనాలో సిగ్నల్ యాప్​పై నిషేధం!
author img

By

Published : Mar 16, 2021, 12:40 PM IST

వాట్సాప్​కు ప్రత్యామ్నాయంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సిఫార్సు చేసిన ఎన్​క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్-'సిగ్నల్​'ను చైనా నిషేధించినట్లు తెలుస్తోంది. చైనాలో ఈ యాప్​ను వీపీఎన్(వర్చువల్ ప్రైవేట్ నెట్​వర్క్) లేనిదే యాక్సెస్ చేయడం కష్టంగా మారింది. దీంతో ఇతర అమెరికా సామాజిక మాధ్యమాల మాదిరిగానే దీనిపైనా ఆంక్షలు విధించినట్లు స్పష్టమవుతోంది.

ఇప్పటికే ఫేస్​బుక్, ట్విట్టర్ వంటి అంతర్జాతీయ సామాజిక మాధ్యమాలను తమ పౌరులకు దూరంగా ఉంచింది జిన్​పింగ్ సర్కార్. అంతర్జాలంపై పరిమితులు విధించేలా రూపొందించిన 'గ్రేట్ ఫైర్​వాల్​'తో అనేక సైట్లను అడ్డుకుంటోంది. నిషేధిత అంశాలపై చర్చించేందుకు రూపొందిన క్లబ్​హౌస్ అనే ఆడియో ప్లాట్​ఫాంను సైతం గత నెలలో నిలిపివేసింది చైనా.

వాట్సాప్ ఇటీవల తీసుకొచ్చిన గోప్యతా విధానంతో చాలా మంది సిగ్నల్ వంటి ప్రత్యామ్నాయ యాప్​లకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో సిగ్నల్ డౌన్​లోడ్​ల సంఖ్య భారీగా పెరిగింది. ఎలాన్ మస్క్ సైతం ఈ యాప్​ ఉపయోగించాలని సూచించడం వల్ల అంతర్జాతీయంగా ఈ మెసేజింగ్ యాప్​కు విశేష ప్రాచుర్యం లభించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.