ETV Bharat / business

'చమురు డిమాండ్​ తగ్గింది.. ఏం చేద్దాం?' - కరోనా వైరస్​ చమురు డిమాండ్​

సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒపెక్​ కార్టెల్​ దేశాలు సోమవారం వర్చువల్​గా భేటీకాన్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ దేశాలు మళ్లీ లాక్​డౌన్​లోకి జారుకుంటుండటం వల్ల.. చమురు ఉత్పత్తిపై ఆయా దేశాలు కీలక నిర్ణయం తీసుకోనున్నాయి.

Members of oil cartel to meet as coronavirus rattles demand
'చమురు డిమాండ్​ తగ్గింది.. ఏం చేద్దాం?'
author img

By

Published : Nov 30, 2020, 3:12 PM IST

కరోనా 2.0తో ప్రపంచ దేశాలు మరోమారు లాక్​డౌన్​ బాటపట్టిన నేపథ్యంలో ఒపెక్​ కార్టెల్ దేశాలు సోమవారం కీలక సమావేశం జరపనున్నాయి. చమురుకు డిమాండ్​ తగ్గుతున్న తరుణంలో.. దాని ఉత్పత్తిపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నాయి.

చమురు ధరలకు ఊతమందించేందుకు.. ఉత్పత్తిలో కోతను వచ్చే ఏడాది కూడా ఆయా దేశాలు కొనసాగించే అవకాశముంది.

సౌదీ అరేబియా నేతృత్వంలో వర్చువల్​గా ఈ భేటీ జరగనుంది. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన అనంతరం రష్యా నేతృత్వంలోని ఒపెక్​ ప్లస్​ దేశాలతో వీరు చర్చలు జరుపుతారు. ఒపెక్​ ప్లస్​ సభ్యులు మంగళవారం భేటీకానున్నారు.

అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంత చమురు అవసరమవుతుందనేది లెక్కకట్టడం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా టీకాపై జరుగుతున్న ట్రయల్స్​ ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. చమురు డిమాండ్​ మునుపటి స్థాయికి చేరే అవకాశాలు లేవని అభిప్రాయపడుతున్నారు. కరోనా సంక్షోభంలో ప్రయాణాలపై ఆంక్షలు, భూతాపాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలే ఇందుకు కారణంటున్నారు.

ఇదీ చూడండి:- అప్పు అదుపు తప్పితే తలెత్తే సమస్యలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.