మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ వస్తుందంటే ఎన్ని కెమెరాలు ఉన్నాయి.. ఎంత ర్యామ్ ఇస్తున్నారు.. డిస్‌ప్లే.. బ్యాటరీ సామర్థ్యం వంటి వాటిపై దృష్టి పెడతాం. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. 5జీ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చూస్తున్నారు. త్వరలోనే 5జీ సేవలను అందించేందుకు నెట్‌వర్క్ సంస్థలు సిద్ధం అవుతుండటంతో మొబైల్ కంపెనీలు కూడా 5జీ ఫీచర్‌తో ఫోన్లను విడుదల చేస్తున్నాయి. కానీ, వాటి ధర ఎక్కువ కావడంతో 5జీ టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్ అనేది బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలనుకునే వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
5జీ ఫోన్లలో ఉపయోగించే ప్రాసెసర్ ఎక్కువ ఖరీదు కావడం వల్లనే ఫోన్ల ధరలు పెంచాల్సి వస్తోందనేది మొబైల్ కంపెనీల వాదన. దీనిదృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ధర ఫోన్లు తయారు చేసే కంపెనీల కోసం మీడియా టెక్ కంపెనీ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మీడియాటెక్ బడ్జెట్ ఫోన్ల కోసం డైమెన్సిటీ 720 ప్రాసెసర్ తీసుకొచ్చింది. తాజా ప్రకటనతో బడ్జెట్ ధరలో 5జీ ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చేందుకు మొబైల్ కంపెనీలకు మార్గం సుగమమైంది. మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ డ్యూయల్ సిమ్ 5జీని సపోర్ట్ చేస్తుంది. దాని వల్ల ఒకే ఫోన్‌లో రెండు 5జీ నెటవర్క్‌లను మీరు ఉపయోగించవచ్చు.
-
MediaTek Dimensity 700, a 7nm chip designed to bring advanced #5G capabilities to the mass market. Incl; #MediaTek 5G UltraSave, Dual 5G SIM support, premium 90Hz display, up to 64MP cameras & night shot enhancements, & multiple voice assistant support. https://t.co/L2RbVvLnRA pic.twitter.com/kQLL0q7kCc
— MediaTek (@MediaTek) November 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">MediaTek Dimensity 700, a 7nm chip designed to bring advanced #5G capabilities to the mass market. Incl; #MediaTek 5G UltraSave, Dual 5G SIM support, premium 90Hz display, up to 64MP cameras & night shot enhancements, & multiple voice assistant support. https://t.co/L2RbVvLnRA pic.twitter.com/kQLL0q7kCc
— MediaTek (@MediaTek) November 10, 2020MediaTek Dimensity 700, a 7nm chip designed to bring advanced #5G capabilities to the mass market. Incl; #MediaTek 5G UltraSave, Dual 5G SIM support, premium 90Hz display, up to 64MP cameras & night shot enhancements, & multiple voice assistant support. https://t.co/L2RbVvLnRA pic.twitter.com/kQLL0q7kCc
— MediaTek (@MediaTek) November 10, 2020
అలానే, ఈ ప్రాసెసర్‌తో 5జీ డౌన్‌లింక్ వేగం 2.77జీబీపీఎస్ ఉంటుందట. మరింత మెరుగైన నెట్‌వర్క్ సేవల కోసం ఇందులో అల్ట్రాసేవ్ టెక్నాలజీ కూడా ఇస్తున్నారట. ఇంకా ఏఐ-కలర్, ఏఐ-బ్యూటీ, మల్టీ ఫ్రేం నాయిస్ రిడక్షన్ ఫీచర్స్ 48 ఎంపీ, 64 ఎంపీ కెమెరాలతో పాటు 90హెడ్జ్ ప్రీమియం డిస్‌ప్లేను ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. 2021 తొలి త్రైమాసికంలో డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో తొలి బడ్జెట్ 5జీ ఫోన్ అందుబాటులోకి వస్తుందని, ధర 250 డాలర్లు ఉంటుందని మీడియాటెక్ తెలిపింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.18,000. అయితే ఈ ధర మరింత తగ్గొచ్చనేది మార్కెట్ వర్గాల అభిప్రాయం.
ఇదీ చూడండి: సమస్యల పథంలోనే సాంకేతిక రథం